బొత్స మేనల్లుడికి ఢిల్లీ దారిట ?

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు అన్నది తెలిసిందే.;

Update: 2025-12-13 03:30 GMT

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు అన్నది తెలిసిందే. మేనమామ నుంచి రాజకీయ ఓనమాలు దిద్ది కీలక నేతగా జిల్లాలో ఆయన ఎదిగారు. చిన్న శ్రీను అంటే విజయనగరంలో తెలియని వారు లేరు. బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటే విజయనగరం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేది చిన్న శ్రీను అని అంతా అంటారు. ఆయన స్థానికంగా బలంగా ఉన్నారు. అంతే కాదు వైసీపీ జిల్లా ఆధ్యక్షుడిగా ఉంటూ పట్టు సాధించారు.

భీమిలీ ఇంచార్జిగా :

అయితే జగన్ ఆయనను ఆ మధ్యన భీమునిపట్నం వైసీపీ ఇంచార్జిగా నియమించారు. భీమిలీ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు విజయనగరంతో లింక్ అయి ఉంటాయి. దాంతో పాటు బలమైన కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఇక బొత్స ఫ్యామిలీకి ఉన్న బలం బలగం అన్నీ దృష్టిలో ఉంచుకుని చిన్న శ్రీనుకు భీమిలీ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. అయితే భీమిలీ టీడీపీకి కంచు కోట. అక్కడ ఉన్నది గంటా శ్రీనివాసరావు, ఆయనను ఓడించడం కష్టం. దనతో వైసీపీ కూడా కొత్త ప్లాన్ లో ఉందని అంటున్నారు. ష్తానికులకు అన్ని రకాలా బలమైన నేతకి భీమిలీ సీటు ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు.

ఎంపీ సీటుకు ఆయనే :

ఇక భీమిలీ వైసీపీ ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్నా కూడా చిన్న శ్రీనుని ఎన్నికల ముందు విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయిస్తుందని అంటున్నారు ఆయన అయితేనే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమీకరించుకుని గెలుపు బాట పట్టగలని వైసీపీ ఊహిస్తోందిట. ఈసారి వైసీపీ కొత్త వ్యూహాన్ని అనుసరించాలని చూస్తోంది అని అంటున్నారు బలమైన అభ్యర్ధులను ఎంపీలుగా రంగంలోకి దించడం ద్వారా అసెంబ్లీ సీట్లను కూడా గణనీయంగా గెలుచుకోవచ్చు అని భావిస్తోంది అంటున్నారు. ఈ క్రమంలో చిన్న శ్రీనుని ఢిల్లీ బాట పట్టించాలని చూస్తున్నారుట.

అసెంబ్లీకేనా :

అయితే చిన్న శ్రీను మనసు మాత్రం అసెంబ్లీకే కట్టుబడి ఉందని అంటున్నారు నిజానికి 2024 ఎన్నికల్లో ఆయననే ఎంపీగా పోటీ చేయమని అడిగారు అని ప్రచారంలో ఉంది కానీ ఆయన నో చెప్పారని అప్పట్లోనే విన వచ్చింది. మరి ఆయన 2029లో లోక్ సభకు పోటీ చేస్తారా అన్నది ఒక సందేహంగా ఉంది. అయితే హైకమాండ్ నిర్ణయం శిరోధార్యంగా భావిస్తే మాత్రం పోటీ చేయాల్సిందే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చిన్న శ్రీను భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని చూస్తూంటే ఆయన పేరుని ఎంపీ సీటుకు పరిశీలిస్తున్నారు అన్నది ప్రచారంగా ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగా సమయం ఉన్నందువల్ల ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News