మాయావతి మేనకోడలు భర్తపై వరకట్నం కేసు!

ఎఫ్‌ఐఆర్‌లో పుష్పా దేవి, ఆమె భర్త శ్రీపాల్ సింగ్, విశాల్ (భర్త) , మరో నలుగురు బంధువుల పేర్లు ఉన్నాయి.;

Update: 2025-04-12 17:31 GMT

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకురాలు మాయావతి మేనకోడలు తన భర్త, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త , అతని కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు హాపూర్ మునిసిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ పుష్పా దేవి , మరో ఆరుగురు కుటుంబ సభ్యులపై హాపూర్ నగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

బాధితురాలి తరపు న్యాయవాది రాజీవ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 నవంబర్ 9న పుష్పా దేవి కుమారుడు విశాల్‌తో బాధితురాలి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి నిందితుల కుటుంబం తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పార్టీ టికెట్, రూ. 50 లక్షల నగదు , ఒక ఫ్లాట్‌ను వరకట్నంగా డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు.

బాధితురాలు తన భర్త విశాల్ బాడీబిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల అతను "వైవాహిక జీవితానికి వైద్యపరంగా అనర్హుడు" అని కూడా పేర్కొంది. దీని కారణంగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని, 2025 ఫిబ్రవరి 17న పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుందని ఆమె తెలిపింది. ఆ రోజు ఆమె మామగారు, బావమరిది తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆరోపించింది. ఈ సంఘటన తర్వాత ఆమె తన పుట్టింటికి తిరిగి వెళ్లిపోయింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, తొలుత ఎలాంటి చర్య తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. మార్చి 21న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు రిజిస్టర్డ్ ఫిర్యాదు పంపినా స్పందన రాలేదని శర్మ తెలిపారు. దీంతో ఆమె మార్చి 24న కోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 9న చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్ బ్రహ్మపాల్ సింగ్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న హాపూర్ నగర్ కొత్వాలిలో ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఎస్‌హెచ్‌ఓ మునీష్ ప్రతాప్ సింగ్ ధృవీకరించారు. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో పుష్పా దేవి, ఆమె భర్త శ్రీపాల్ సింగ్, విశాల్ (భర్త) , మరో నలుగురు బంధువుల పేర్లు ఉన్నాయి. ఘజియాబాద్‌లో రూ. 50 లక్షలు , ఒక ఫ్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన అత్తమామలు తనను మానసికంగా మరియు శారీరకంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. తన భర్త వైద్య పరిస్థితి గురించి అత్తమామలను నిలదీసినప్పుడు భూపేంద్ర అలియాస్ మోనుతో బిడ్డను కనమని సూచించారని బాధితురాలు ఆరోపించింది.

ఫిబ్రవరి 17న రాత్రి తన మామగారు బావమరిది తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది. తాను కేకలు వేసినప్పటికీ, వారు తనను లోపలికి లాగి, తమ వరకట్న డిమాండ్లు తీర్చకపోతే తనను..తన కుటుంబ సభ్యుల పరువు తీస్తామని బెదిరించారని ఆమె తెలిపింది.

తన అత్తమామల రాజకీయ పలుకుబడి కారణంగా తన ఫిర్యాదులను తొలుత పట్టించుకోలేదని బాధితురాలు తన నిరాశను వ్యక్తం చేసింది. మార్చి 21న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు రిజిస్టర్డ్ ఫిర్యాదు పంపినా స్పందన రాలేదని శర్మ తెలిపారు. దీంతో ఆమె మార్చి 24న కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆరోపణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News