మోడీ సార్...మీరు మారిపోయారు !

కాంగ్రెస్ లో దిగ్గజ నేత జాతీయ అధ్యక్షుడు అయిన మల్లిఖార్జున ఖర్గే. దాంతో ఆశ్చర్యపోవడం మోడీ వంతు అయింది అని అంటున్నారు.

Update: 2026-08-12 18:31 GMT

మోడీలో కాంగ్రెస్ చూసిన మార్పు ఏమిటో అన్నది అయితే ఎవరికీ అర్థం కావడం లేదు, రాజకీయంగా చూస్తే బీజేపీ కాంగ్రెస్ బద్ధ ప్రత్యర్ధులు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయితే కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతూనే ఉంటారు. గాంధీల వంశం అంటారు. రాహుల్ ని యువ రాజ్ అని సంభోదిస్తూ సెటైర్లు వేస్తారు. అలాంటి నరేంద్ర మోడీని చూసి మీరు మారిపోయారు సార్ అని అన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ లో దిగ్గజ నేత జాతీయ అధ్యక్షుడు అయిన మల్లిఖార్జున ఖర్గే. దాంతో ఆశ్చర్యపోవడం మోడీ వంతు అయింది అని అంటున్నారు.

సరదాగానే సాగినా :

ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీతో సరదాగా మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భాయ్ సాబ్ అప్ తోడా బదల్ గయే హో అన్నారు. అంటే దాని అర్థం సార్ మీరు కొంచెం మారిపోయారు అని. ఈ విధంగా ఖర్గే వ్యాఖ్యానించగా దానికి నరేంద్ర మోదీ నవ్వుతూనే ఓహ్ రియల్లీ అని బదులిచ్చారు. న్యూఢిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహ రిసెప్షన్ లో ఈ ముచ్చట జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ బీజేపీ ప్రముఖులు సహా అన్ని రాజకీయ పార్టీల నుంచి పెద్దలు హాజరయ్యారు. అలా నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఆయన వస్తూనే అప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లను పలకరించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరితో నవ్వుతూ మోడీ మాట్లాడారు. ప్రియాంకను ఉద్దేశించి ఆయన బాగున్నారా అన్నారు. అదే సమయంలో ఖర్గే అయితే మీరు మారిపోయారు అని కామెంట్స్ చేశారు. దాంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సరదాగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

కేంద్ర మంత్రి రాజీనామాతో :

ఇంతకీ మోడీ మారిపోవడం అన్న చర్చ ఎందుకు వచ్చింది. ఏమి జరిగింది అన్నది చూస్తే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలేనా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. మోడీ అంటే తాను తీసుకున్న నిర్ణయానికి తల ఒగ్గరని పేరు ఉంది. అలాంటిది ఆయన మంత్రి వర్గంలో అత్యంత సన్నిహితుడైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంచలనమే అయింది. నిజానికి అలా జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేదని అంటారు. అందుకే మోడీ వైఖరిలో ఈ మార్పు చూసిన ప్రధాని ప్రతిపక్షం కాంగ్రెస్ మారిపోయారు సార్ అని అంటోందా అని అంతా చర్చించుకుంటున్నారు. అంతే కాదు విద్యార్ధుల ఉద్యమం తరువాత మోడీ ఎక్కువగా ఇన్స్టా గ్రామ్ లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మరి దాని మీద అయినా కాంగ్రెస్ మారిపోయారు సార్ అని కామెంట్స్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా 12 ఏళ్ల పాటు దేశాన్ని ఏకపక్షంగా పాలించిన మోడీ ఈ వర్షాకాల సమావేశాలలో మాత్రం విపక్షాల డిమాండ్లను స్వాగతిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నారు అన్నది కూడా ఉంది బహుశా ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఈ విధంగా ఖర్గే వ్యాఖ్యానించారేమో అంటున్నారు. మరో వైపు చూస్తే రాజకీయాలకు అతీతంగా మోడీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతూ కులాసాగా కబుర్లు చెబుతూ కనిపించడం మాత్రం అందరినీ ఆకట్టుకుంది.



Tags:    

Similar News