• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీవి కలలే... కొట్టి...

మోడీవి కలలే... కొట్టి పారేసిన కాంగ్రెస్

| ఒకే దేశం ఒకే రాజకీయం అన్నది బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ అని విపక్షలు విమర్శలు చేస్తున్న సంగతి విధితమే.

By - Tupaki Desk
Update: 2024-11-01 01:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి జమిలి ఎన్నికలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఒకే దేశం ఒకే రాజకీయం అన్నది బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ అని విపక్షలు విమర్శలు చేస్తున్న సంగతి విధితమే.

జమిలి ఎన్నికలు అంటే కచ్చితంగా దేశంలో జాతీయ పార్టీలదే పై చేయిగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వారి ఆకాంక్షలు అన్నీ కూడా పూర్తిగా పక్కకు పోతాయి. అదే టైం లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి భారీ అడ్వాంటేజ్ లభిస్తుంది.

అందుకే బీజేపీ జమిలి ఎన్నికల నినాదాన్ని అందుకుంది. బీజేపీ ఏ స్లోగన్ ఇచ్చినా అందులో కచ్చితంగా పార్టీ ప్రయోజనాలు ఉంటాయని విపక్షాలు ఎపుడూఅ అంటూ ఉంటాయి. ఇపుడు కూడా అదే అంటున్నాయి. మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే నో అంటోంది కాంగ్రెస్.

మోడీవి కలలే అని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా కొట్టి పారేస్తోంది.జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే మాటలా అని కూడా సెటైర్లు వేస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది అసలు అమలు అయ్యేది కాదూ పాడూ కాదు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె భారీ కౌంటర్ ఇచ్చారు

ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మోడీ తాజాగా జమిలి ఎన్నికలు అనివార్యం అంటూ చేసిన కామెంట్స్ ని పూర్తి స్థాయిలో తప్పు పట్టారు. మోడీ అసలు ఏమి మాట్లాడుతున్నారు అని కూడా ఆయన ప్రశ్నించారు.

మఒడీ జమిలి ఎన్నికలు అని చెప్పడమే తప్ప అమలు చేయలేరని కుండబద్ధలు కొట్టారు. జమిలి ఎన్నికలు అంటే ఆషామాషీ కాదని పార్లమెంట్ లో అన్ని పార్టీల ఆమోదం ఉండాలని అపుడే అది ఆచరణలోకి వస్తుందని అన్నారు. అందువల్లనే తాము గట్టిగా చెబుతున్నామని జమిలి ఎన్నికలు అన్న దానిని మోడీ అసలు అమలు చేయలేరని ఆయన అన్నారు.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి లోక్ సభలో 240 మంది దాకా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా తొంబైకి తక్కువ లేకుండా ఎంపీలు ఉన్నారు. ఇక దేశంలో ఇండియా కూటమి పార్టీలు చాలా రాష్ట్రాలను ఏలుతున్నాయి. ఈ నేపధ్యంలో జమిలి ఎన్నికలు అంటూ బీజేపీ చెబుతున్నది ఆచరణ సాధ్యమేనా అన్న చర్చకు తెర లేస్తోంది.

అడ్డంగా విపక్షాలు దీనిని కొట్టి పారేస్తున్న నేపధ్యంలో బీజేపీ ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదని అంటున్నారు. ఇక ప్రాంతీయ పార్టీలు ఏవీ ఈ ప్రతిపాదనకు అసలు మద్దతు ఇవ్వవని అంటున్నారు. దీంతో మోడీ జమిలి అంటే కాంగ్రెస్ నో జమిలి అంటోంది. మరి ఇది అయ్యేది ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    
  • Congressparty 
  • Bjp 
  • NarendraModi 
  • PM 
  • MallikarjunKharge 
  • Comments 
  • Bengaluru 
  • Media 
  • IndianNationalLokDal 
  • INLD 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS