స్మశానంలో రాక్షసుడు... మహిళల సమాధులు తవ్వి...!

అవును... మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జిల్లాలో అమావాస్య రాత్రులలో ఓ వ్యక్తి అత్యంత అసహ్యకరమైన పనులు చేస్తున్నాడు.;

Update: 2025-09-26 09:40 GMT

మనుషుల్లో చాలా రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారన్నది వాస్తవమే కానీ... వారిలో కొంతమంది మాత్రం పూర్తిగా తాము మనుషులం అన్న విషయం మరిచి, ఇంగితం విడిచి, తమలోని వికృత ఆలోచనలకు కార్యరూపం దాల్చుతుంటారు. అలా చేసిన ఓ వ్యక్తి స్మశానంలోని మహిళల సమాధులు తవ్వి నీచానికి పాల్పడుతున్నాడు.

అవును... మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జిల్లాలో అమావాస్య రాత్రులలో ఓ వ్యక్తి అత్యంత అసహ్యకరమైన పనులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా... అయూబ్ ఖాన్ అనే వ్యక్తి స్మనాన వాటికలో పగటి పూట మహిళ సమాధులను వెతుకుతున్నాడు. ఇక రాత్రి వేళలో ఆ సమాధులను తవ్వి మంత్రవిద్యతో ప్రయోగాలు చేసినట్లు తెలిపారు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయూభ్ ఖాన్ అమావాస్య రాత్రులలో సమాధులు తవ్వడానికి వెళ్లేవాడు. ముందుగా పగటిపూట మహిళల కొత్త సమాధుల కోసం వెతుకుతూ, రాత్రి సమయంలో ఆ శవాలను బయటకు తీసి, పాడు చర్యలకు పాల్పడేవాడు! ఇదే సమయంలో ఇప్పటికే మూడు సమాధులపై మంత్రవిద్యతో ప్రయోగాలు చేసినట్లు తెలిపారు

2010లో తన భార్యను హత్య చేసిన కేసులో 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అయూబ్ ఖాన్ పై ఇప్పటికే 11 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇటివల మే 19, సెప్టెంబర్ 21 తేదీలలో బడా కబ్రస్తాన్‌ లో మృతదేహాలను ముక్కలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.

ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. 50 ఏళ్ల అయూబ్ ఖాన్‌ ను గుర్తించి అరెస్టు చేశారు. ఈ సమయంలో నిందితుడిని సంఘటనా తీసుకెళ్లి సీన్ రీ క్రియేషన్ చేస్తుండగా.. ముస్లిం సమాజానికి చెందిన పలువురు పెద్దలు, పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ రాయ్.. ఆయుభ్ ఖాన్ జైలు నుండి విడుదలైన తర్వాత, క్షుద్ర పూజలు చేయడానికి స్మశానవాటికలో సమాధులు తవ్వడం ప్రారంభించాడని అన్నారు. తన శక్తులను పెంచుకోవడానికి కర్మలు చేసేవాడని.. ఇప్పటివరకు మూడుసార్లు సమాధులు తవ్వి, శవాలను తారుమారు చేశాడని వెల్లడించారు.

Tags:    

Similar News