సొంత పార్టీలకు ఓటు వేసుకోలేని మాధవీలత, అసదుద్దీన్?

ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. కొందరు అభ్యర్థులు తమ సొంత పార్టీలకు ఓటు వేయలేని స్థితి నెలకొంది.

Update: 2024-05-09 10:30 GMT

ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. కొందరు అభ్యర్థులు తమ సొంత పార్టీలకు ఓటు వేయలేని స్థితి నెలకొంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ పార్టమెంట్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత తమ పార్టీలకు ఓటు వేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓటు హక్కు ఉన్నా వారి ఓటు వారి పార్టీకి వేసుకోలేని దుస్థితి.

రాజేంద్రనగర్ లో నివాసముంటున్న అసదుద్దీన్ ఓవైసీ పోలింగ్ కేంద్రం చేవెళ్ల నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎంఐఎం అభ్యర్థి పోటీలో లేకపోవడంతో అసదుద్దీన్ ఓవైసీ ఇతరులకు ఓటు వేయాల్సిన అవసరం ఏర్పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. మహేంద్ర హిల్స్ లో నివాసం ఉంటున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఓటు వేసే అవకాశం కనిపించడం లేదు.

దీంతో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తమ సొంత పార్టీలకు ఓటు వేసుకునే వెసులుబాటు లేకపోవడంతో ఇతర పార్టీలకు ఓటు వేయాల్సి వస్తోంది. బీఆర్ఎస్ కాసాని జ్ణానేశ్వర్ తో పాటు కాంగ్రెస్ కు చెందిన పట్నం సునీత, మహమ్మద్ సమీర్ వంటి వారు కూడా ఇతర అభ్యర్థులకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. సొంత పార్టీలకే ఓటు వేయడానికి వీలు లేకుండా పోతోంది.

బీజేపీ, ఎంఐఎం నేతలిద్దరు తమ ఓటు సొంత పార్టీలకు వేసుకోలేని స్థితిలో వారు ఎవరికి వేస్తారో తెలియడం లేదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో రెండు పార్టీల నేతలు వేరే పార్టీలకు ఓటు వేయాల్సి వస్తోంది. వారికి వారు ఓటు వేసుకోలేని స్థితి. ఈ నేపథ్యంలో వారి కష్టం ఎవరికి రాకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పరిస్థితిలో మాధవీలత, అసదుద్దీన్ ఓవైసీ ఇతరులకు ఓటు వేసే అవకాశం ఉంది. వారి సొంత పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి వేయాల్సిన అగత్యం ఏర్పడింది. భౌగోళిక అసమానతల కారణంగా సొంత పార్టీలకు ఓటు వేసుకోలేని పరిణామం కలిగింది. దీంతో ఏం చేస్తారో అర్థం కావడం లేదు.

Tags:    

Similar News