గురుమూర్తి గ్రాఫ్‌పై టీడీపీలో చర్చ.. !
కానీ పార్లమెంట్ స్థానంలో మాత్రం మద్దెల గురుమూర్తి విజయం సాధించారు. ఇది చాలా ఆశ్చర్యకర పరిణామం అని అప్పట్లోనే చర్చ నడిచింది.;
సాధారణంగా అధికారంలో ఉన్న ఎంపీలు దూసుకుపోతారు. అధికారంలో ఉన్న నాయకులు అన్ని సర్వేలలోనూ ముందుంటారు. ఇది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దీనికి భిన్నంగా వైసిపి లో ఉన్న నాయకుడు ముఖ్యంగా గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పార్లమెంటు కు ఎన్నికైన గురుమూర్తి అనూహరీతిలో పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు 17 మాసాల్లో రెండు మూడు సార్లు సర్వే జరిగగా అన్ని సర్వేల్లోనూ ఆయన మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్రజల్లోనూ మంచి నేతగా ఎదుగుతున్నారు.
తాజాగా `రైజ్` సంస్థ నిర్వహించిన సర్వేలో మద్దెల గురుమూర్తి 7.8 స్కోర్ తో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది నిజానికి అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే 21 మంది కూటమి ఎంపీలు ఉండగా వారిలో తొలి అయిదుగురిలో మద్దెల గురుమూర్తి ఉండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. అయితే, దీనికి ప్రధాన కారణం నియోజకవర్గ విషయంలోనూ అదే సమయంలో రాజకీయాల విషయంలోను గురుమూర్తి తటస్థంగా వ్యవహరించటంతో పాటు ప్రజలకు చెరువగా ఉండడం.
దూకుడు నిర్ణయాలు.. దూకుడు వ్యాఖ్యలు, విమర్శలు వివాదాలకు అత్యంత దూరంగా ఉండటం వంటి ఆయనకు కలిసి వస్తున్న ప్రధాన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి వైసీపీకి నలుగురు ఎంపీలు ఉంటే వారిలో ఒక్కరు మాత్రమే తొలి పది స్థానాల్లో నిలబడటం విశేషం అనే చెప్పాలి. వారిలో గురుమూర్తి కావడం మరింత విశేషం. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి/ జనసేన విజయం దక్కించుకుంది.
కానీ పార్లమెంట్ స్థానంలో మాత్రం మద్దెల గురుమూర్తి విజయం సాధించారు. ఇది చాలా ఆశ్చర్యకర పరిణామం అని అప్పట్లోనే చర్చ నడిచింది. ఇప్పుడు కూడా ప్రజలకు చేరువవుతున్న ఎంపీగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎంపీగా గురుమూర్తి నిలుస్తున్నారు. ఇక పార్లమెంటు వ్యవహారాల విషయానికి వస్తే పార్లమెంట్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావి స్తున్నారు. హాజరు విషయంలోనూ ఆయన మంచి గ్రాఫ్‌నే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఆయనకు మంచి మార్కులు వేసేలా చేసింది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఈ గ్రాఫ్ ని ఇలాగే కొనసాగిస్తే తిరుపతి ఎంపీగా ఆయన మరోసారి గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.