వారికి గుండెలు అదిరే షాకింగ్ విషయం చెప్పిన లోకేష్!
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు "యువగళం" పాదయాత్ర చేపట్టి, రాష్ట్రం మొత్తం నడిచిన లోకేష్ కు.. ప్రజలు, కార్యకర్తలనుంచి అనేక ఫిర్యాదులు అందాయి.;
ఏపీ రాజకీయాల్లో "రెడ్ బుక్"కి ఓ ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు "యువగళం" పాదయాత్ర చేపట్టి, రాష్ట్రం మొత్తం నడిచిన లోకేష్ కు.. ప్రజలు, కార్యకర్తలనుంచి అనేక ఫిర్యాదులు అందాయి. అందులో అనైతిక చర్యలు అత్యధికంగా ఉన్నాయని తెలిసింది! దీంతో.. రెడ్ బుక్ రాయడం మొదలుపెట్టారు.. అధికారంలోకి రాగానే ఆ బుక్ ఓపెన్ చేశారు, తప్పులు చేసినవారిని లోపలకు పంపే పనులు మొదలుపెట్టారు!
ఆ విధంగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది. దీంతో.. ఎర్ర బుక్ అంటేనే చాలామంది భయపడిపోయే పరిస్థితి. ఈ బుక్ ఎఫెక్ట్ తో చాలామంది గుర్తుపట్టని స్థాయిలో మారిపోతే.. మరికొంతమంది గుర్తించని స్థాయికి చేరిపోయారని అంటుంటారు. అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఎర్ర బుక్ కు పార్టీలు ఉండవు.. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినవారే దాని లక్ష్యం. ఈ సమయంలో మరో షాకింగ్ న్యూస్!
అవును... గత ప్రభుత్వ హయాంలో చట్టవ్యతిరేకంగా నడుచుకున్నవారికి లోకేష్ రెడ్ బుక్ అనేది సింహ స్వప్నం అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఆల్ మోస్ట్ చాలా వరకూ ఆ బుక్ లోకి ఎక్కినవారు.. స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు, జైలు మెట్లు ఎక్కారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలినవారు చాలామంది హమ్మయ్య అని కాస్త రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తున్నారని అంటున్నారు!
సరిగ్గా ఈ సమయంలో లోకేష్ నుంచి ఓ బాంబు లాంటి వార్త విడుదలయ్యింది. అదేమిటంటే... రెడ్ బుక్ లో ఇప్పటివరకూ కేవలం మూడు పేజీలే అయ్యాయంట. తాజాగా రాజమండ్రిలో పర్యటించిన మంత్రి లోకేష్ ఈ విషయంపై మాట్లాడుతూ... "ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు.. రప్పారప్పా అంటున్నారు.. మేము రెండు రప్పాలిస్తాం.. రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి.. ఇంకా చాలానే ఉన్నాయి.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో.. ఎంత మంచి సినిమాలో అయినా, అందులోనూ చిన్న విలన్ ఉంటాడని మొదలుపెట్టిన లోకేష్.. మనకూ ఓ విలన్ ఉన్నాడని, ఆయనొస్తే అరెస్ట్ చేస్తానని చెబుతున్నాడని అన్నారు. ‘మన నాయకుడిని జైల్లో వేసి ఏమి చేయగలిగారు.. ఇప్పుడు ఆయన బెదిరింపులకు భయపడాలా.. ఆయనకంటే ముందు ఇలానే మాట్లాడినవారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో గుర్తుతెచ్చుకోండి’ అంటూ.. అర్ధమవ్వాల్సిన వారికి అర్ధమయ్యేలా పేర్లు ప్రస్థావించకుండా క్లారిటీ వ్యాఖ్యానించారు.
దీంతో ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఓ వర్గంలో హాట్ టాపిక్ గా మారాయని అంటున్నారు. ప్రస్తుతానికి రెడ్ బుక్ మూసేశారేమో.. మనం తప్పించుకున్నట్లున్నాం.. హమ్మయ్య.. అని రిలాక్స్ అయినవారికి ఆ ఒక్క మాటతో శీతాకాలంలోనూ చెమటలు పడుతున్నాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు లోకేష్. ఇందులో భాగంగా... జగన్ తో తాను ఎంత పోరాడానో, పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి సొంతవారితోనూ అంతే పోరాడానని.. మారిన కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో... ఈ రోజుకు కూడా చంద్రబాబునాయుడితో పోరాడతా.. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మాత్రం తలవంచి దాన్ని అమలుచేసే వ్యక్తిని నేను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో.. పార్టీలో సరికొత్త మార్పులకు, సంస్కరణలకు లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.
నన్నయ విశ్వవిద్యాలయంలో నూతన భవనాలు!:
మరోవైపు.. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రూ.34 కోట్లతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్ ప్రసన్న శ్రీ, ప్రొఫెసర్స్ తో మాట్లాడి.. విద్యోన్నతి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వర్శిటీలోని సమస్యలు విని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.