'నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. ఆయన మాజీ ముఖ్యమంత్రి' - లోకేశ్ మరో ట్వీట్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి టార్గెట్ గా మంత్రి లోకేశ్ మరో ట్వీట్ చేశారు. డీఎస్సీపై చర్చకు మూడో రోజు కూడా ఎదురుచూస్తున్నట్లు ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి టార్గెట్ గా మంత్రి లోకేశ్ మరో ట్వీట్ చేశారు. డీఎస్సీపై చర్చకు మూడో రోజు కూడా ఎదురుచూస్తున్నట్లు ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ తాను చాలెంజ్ చేసి మూడు రోజులు అవుతోందని, ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తో చర్చకు రెడీగా ఉన్నానంటూ లోకేశ్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ లోపల, బయట ఎక్కడైనా డీఎస్సీపై మాజీ సీఎం జగన్మోహనరెడ్డి, ఆయన పార్టీ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చిద్దామని, వేదిక ఎక్కడో నిర్ణయించాలని మంత్రి లోకేశ్ సవాల్ చేశారు. ఈ విషయమై మంగళవారం రెండో రోజు కూడా వైసీపీని చర్చకు రమ్మని ఆహ్వానిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ఆ పార్టీ నుంచి స్పందన రాలేదని చెబుతూ మూడోరోజు కూడా లోకేశ్ ట్వీట్ చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది.
డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి లోకేశ్ మూడో రోజు స్పష్టం చేశారు. దీనిపై ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. మూడో రోజు కూడా జగన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్నా. ఆయన నా చాలెంజ్ ను స్వీకరించాలని కోరుకుంటున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేను అని, ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక వేదిక ఎక్కడ అనేది నిర్ణయించే అవకాశం కూడా జగన్మోహనరెడ్డికే వదిలేస్తున్నట్లు లోకేశ్ ఆ ట్వీటులో పేర్కొన్నారు. మంగళవారం రెండో రోజు ట్వీటు చేసినట్లే బుధవారం కూడా ఆయన ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ట్వీట్ చేశారు.
రెండో రోజు ట్వీటులో ఫన్నీ మీమ్ ను పోస్టు చేసిన మంత్రి లోకేశ్ మూడో రోజు కూడా అదే తరహాలో స్టిల్ వెయిటింగ్ అని రాసివున్న గిఫ్ ఫొటోను జత చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి లోకేశ్ ఆ వేదికను రాజకీయంగా సమర్థంగా వినియోగించుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. లోకేశ్ వరుసగా ట్వీట్లతో దాడి చేస్తున్నా, ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందించకపోవడపై పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే ఫస్ట్ టైం గెలిచిన మంత్రి లోకేశ్ తో చర్చకు తాను సరిపోతానంటూ మాజీ మంత్రి పేర్ని నాని గతంలో చేసిన సవాల్ నే వైసీపీ తన సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది.
అంతేకాని ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ నుంచి సరైన స్పందన కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమావేశమవుతున్నారు. తాడేపల్లిలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ విసిరిన చాలెంజ్ పై ఆయన ఏమైనా స్పందిస్తారా అని పరిశీలకులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని, వేదిక ఆ పార్టీయే నిర్ణయించాలని మంత్రి లోకేశ్ చేస్తున్న సవాల్ తో వైసీపీ ఎదురుదాడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.