నా ముగ్గురు పిల్లలు చనిపోవడం వల్లే క్షేమంగా ఉన్నారు...!

అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన మాజీ నర్స్‌ లిండ్సే క్లాన్సీ తన ముగ్గురు పిల్లలను హత్య చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.

Update: 2026-08-22 06:11 GMT

అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన మాజీ నర్స్‌ లిండ్సే క్లాన్సీ తన ముగ్గురు పిల్లలను హత్య చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. 2023, జనవరి 24న ఈ దారుణం జరిగింది. క్లాన్సీ తీవ్రమైన మానసిక వేదనకు గురి కావడం వల్ల సొంత పిల్లలను హత్య చేసుకున్నట్లు ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆమె మూడో బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన మానసిక వేదనకు గురి అయిందని, ఆ సమయంలో ఆమెను ఎవరో ఆదేశించినట్లుగా భావించి ముగ్గురు పిల్లలను చంపేసి ఉంటుందని కోర్ట్‌లో ఆమె లాయర్‌లు వాదిస్తున్నారు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్న సమయంలో అలా చేసింది అనే ఆరోపణలు సైతం ఎదుర్కొంటుంది. మొత్తానికి ఈ కేసు తీవ్రమైన చర్చకు తెర తీసింది. కేవలం క్లాన్సీ మాత్రమే కాకుండా డెలివరీ తర్వాత చాలా మంది ఆడవారు మానసిక సంఘర్షణ కు గురి అవుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

ముగ్గురు పిల్లల హత్య కేసులో...

ముగ్గురు పిల్లల హత్య తర్వాత క్లాన్సీ సైతం ఆత్మహత్యకు ప్రయత్నించింది. రెండో అంతస్తు నుంచి ఆమె కిందకు దూకి చనిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో క్లాన్సీ యొక్క వెన్నముఖ విరగడంతో పాటు పలు చోట్ల తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయితే క్లాన్సీ చావు నుంచి బయట పడింది. ఆరోగ్యం బాగు పడ్డ తర్వాత ఒక ఆసుపత్రికి చెందిన మత గురువు ఆమెను కలవడం జరిగిందట. ఆ సమయంలో క్లాన్సీ చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఆమె సంచలన విషయాన్ని ఆ సమయంలో మత గురువు వద్ద చెప్పడం అందరికి షాకింగ్‌గా ఉంది. ఒక మగ గొంతు వినిపించి ఆమెను ఆదేశించినట్లుగా చెప్పుకొచ్చిందట. ఆ మగ గొంతు నీ పిల్లలను చంపేయి, లేదంటే వారు సురక్షితంగా ఉండలేరు. ఈ లోకంలో వారు సురక్షితంగా ఉండటం కష్టం, అందుకే చంపేసి వారిని క్షేమంగా ఉండేలా చూడు అంటూ ఒక గొంతు ఆదేశించిందని క్లాన్సీ పేర్కొంది.

లిండ్సే క్లాన్సీ హత్య కేసు...

పిల్లలను చంపేసిన తర్వాత కూడా ఆమెకు నువ్వు సైతం వచ్చేయి అన్నట్లుగా ఆదేశాలు వచ్చాయని, అందుకే రెండస్తుల నుంచి కిందకు దూకినట్లుగా ఆ మత గురువు చెబుతున్నాడు. ఈ విషయాన్ని కోర్ట్‌లో చెప్పడం ద్వారా ఆమె తరపు లాయర్‌లు ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలను హత్య చేయాలి అనే ఉద్దేశం ఆమెకు లేదు, ఆ హత్య చేస్తున్న సమయంలోనూ ఆమె తన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు ఈ పని చేస్తున్నట్లుగా భావించి ఉంటుందని, అందుకే ఆమెను దోషిగా చూడాల్సిన అక్కర్లేదని, ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలంటూ కోర్ట్‌కు న్యాయమూర్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వారు ముగ్గురు పిల్లలను క్లాన్సీ చంపిందని వాదిస్తున్నారు. అయితే క్లాన్సీ తరపు లాయర్‌ మాత్రం ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేని కారణంగా ఆ హత్యలు చేసిందని అంటున్నారు.

మానసిక సమస్య కారణంగా హత్య...

ఇప్పటికే క్లాన్సీ భర్త అయిన పాట్రిక్‌ క్లాన్సీ సైతం తన భార్యను క్షమించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఆమె మానసిక పరిస్థితి విషయమై మొదటి నుంచి కొంత అనుమానంగానే ఉన్నట్లు అనిపించిందని, అయితే ఇంత పని చేస్తుందని తాను కనీసం ఊహించలేదు అంటూ ఓ సందర్భంగా పాట్రిక్‌ క్లాన్సీ చెప్పకొచ్చాడు. కేవలం మానసిక సమస్య కారణంగానే ఈ హత్య చేసినట్లు లాయర్ నిరూపించినట్లయితే క్లాన్సీకి ఎలాంటి శిక్ష లేకుండా విడుదల అవుతుంది. అయితే కోర్ట్‌ ఆమె మానసిక సమస్య విషయమై సంతృప్తి చెందకుంటే కఠిన శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అమెరికా న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఆమె తప్పు చేసినట్లుగా కోర్ట్‌ భావిస్తే పెరోల్‌ లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉందట. మరి ఏం జరుగుతుందా, ఆమెకు ఏ శిక్ష పడుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News