• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయ్య బాబోయ్ .. ప్రొఫెసర్...

అయ్య బాబోయ్ .. ప్రొఫెసర్ @ లక్ష్మీపార్వతి !

| గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్శిటీలో ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ ను ఏర్పాటు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-07-12 09:18 GMT

లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు కదా ? మరి ప్రొఫెసర్ ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. వైసీపీ పాలనలో ఆమె గత మూడేళ్లుగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆమె తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ ఉద్యోగం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది.

గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్శిటీలో ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ ను ఏర్పాటు చేశారు. దీనికి అసలు విశ్వవిద్యాలయానికే ఏ మాత్రం సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని తీసుకువచ్చి డీన్ గా నియమించారు. ఇందులో పీహెడ్డీ పరిశోధకులకు మార్గదర్శకురాలిగా (గైడ్) లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ వ్యవహారం మూడేళ్ల కిందటే జరిగిపోయింది.

వాస్తవంగా లక్ష్మీపార్వతి విజయవాడలో నివాసం ఉంటారు. పీహెడ్డీ చేసే వారంతా విశాఖపట్నంలో ఉంటారు. మరి విజయవాడలో ఉండే లక్ష్మీపార్వతి విశాఖలో ఉండే వారికి ఎలా గైడెన్స్ చేస్తారు ? చేశారు ? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ గైడ్ గా వ్యవహరించే వారికి కనీసం పీజీ విద్యార్థులకు ఐదేళ్లు పాఠాలు బోధించిన అనుభవం ఉండాలి. కానీ వైసీపీ నేత అన్న ఏకైక అర్హతతో లక్ష్మీపార్వతిని నియమించారు.

లక్ష్మీపార్వతి ఎప్పుడు విశాఖపట్నానికి వస్తారు ? ఆమెతో మేము ఎప్పుడు సలహాలు తీసుకోవాలి ? అని పరిశోధన విద్యార్థులు అడిగిన ప్రశ్నకు అవన్నీ నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను అని డీన్ కమ్ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ భరోసా ఇస్తున్నారట. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.

Tags:    
  • Lakshmiparvathy 
  • Andhrauniversity 
  • Professor 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Tdp 
  • Janasena 
  • Bjp 
  • Chandrababunaidu 

Similar News

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

పవన్ విడాకుల వేళ.. రేణు హుందాతనం

2026-11-10 11:45 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

Copyright @2026

Powered by Blink CMS