మోదీ ఎఫెక్ట్.. లక్షద్వీప్‌లో 47 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో లక్షద్వీప్‌లో పర్యటించి, అక్కడి అందమైన బీచ్‌లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అక్కడ అమల్లో ఉన్న ఒక ముఖ్యమైన చట్టాన్ని మారుస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్షద్వీప్‌ను ఇంటర్నేషనల్ టూరిజం హబ్ గా మార్చాలనే పట్టుదలతో ఉన్న కేంద్రం.. దాదాపు 47 ఏళ్ల తర్వాత అక్కడ మద్యం అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. స్థానిక సంస్కృతి, పర్యాటక రంగం చుట్టూ తిరుగుతున్న ఇంట్రస్టింగ్ విషయాలను చూద్దాం..
1979 నుంచి ఉన్న బ్యాన్ క్లోజ్:
లక్షద్వీప్ జనాభాలో దాదాపు 97 శాతం మంది ముస్లింలే ఉంటారు. ఇస్లాం మతంలో మద్యం సేవించడం నిషిద్ధం కావడంతో, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అక్కడ 1979 నుంచి మద్యం అమ్మకాలపై కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అయితే గతంలో కేవలం రిసార్ట్‌లలో ఉండే విదేశీ పర్యాటకులకు, కొంతమంది ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఇందులో కొన్ని మినహాయింపులు ఉండేవి. కానీ ఇప్పుడు సాధారణ అమ్మకాలకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చేసింది.
మోదీ పర్యటన.. మారిన రూపురేఖలు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో లక్షద్వీప్‌లో పర్యటించి, అక్కడి అందమైన బీచ్‌లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటినుంచి లక్షద్వీప్‌కు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. మాల్దీవులకు గట్టి పోటీ ఇచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది.
టూరిజం కోసమే ఈ రిస్క్?:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను భారీగా ఆకర్షించాలంటే మద్యం అందుబాటులో ఉండటం కీలకమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. మద్యంపై నిషేధం ఎత్తివేయడం వల్ల ఇంటర్నేషనల్ రిసార్ట్స్, పెద్ద పెద్ద హోటళ్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై స్థానికంగా ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకంగా పెద్ద సాహసమనే చెప్పాలి. ఒకవైపు 47 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని బ్రేక్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆర్థికంగా, టూరిజం పరంగా లక్షద్వీప్ రూపురేఖలు మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.