జగన్ విత్ కేవీపీ- మాస్టర్ ప్లాన్ రెడీ ?

ఇదిలా ఉంటే కేవీపీ జగన్ చాలా ఏళ్ళ తరువాత బాహాటంగా ఒక పెళ్ళిలో కలిశారు. చెన్నైలో జగన్ అన్న కొడుకు వివాహానికి ఎంతో మంది అతిరధ మహారధులు వచ్చారు. వారిలో కేవీపీ కూడా ఉన్నారు.;

Update: 2026-02-22 04:17 GMT

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర చాలా ఎక్కువ. ఆయన ఎపుడూ తెర ముందు ఉన్న నాయకుడు కాదు. కానీ కాంగ్రెస్ లో ఆయన మాట పవర్ ఫుల్. ఆయన సూచనలు అన్నీ అమలు అయ్యేవి. ఆయన అంటే పార్టీలో శిలాశాసనం. ఆయనే కేవీపీ రామచంద్రరావు. వైఎస్సార్ కి ఆత్మగా నీడగా ఆయన గురించి చెబుతారు. వైఎస్సార్ సీఎం గా రెండు సార్లు ఉమ్మడి ఏపీకి అయ్యారు. అదే సమయంలో కేవీపీ పాత్ర చాలా ఉందని అంటారు. ఆయన పలుకుబడి కూడా అప్పట్లో చాలా ఉండేదని చెబుతారు. ఇక వైఎస్సార్ కుటుంబంతో కూడా కేవీపీకి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అంకుల్ అంటూ జగన్ షర్మిల ఆయన్ని పిలిచేవారు. అలా కుటుంబ మిత్రుడు అనడం కంటే ఆత్మ బంధువుగా కేవీపీ ఉన్నారని అన్నడం సబబు.

పెళ్ళిలో పలకరింపు :

ఇదిలా ఉంటే కేవీపీ జగన్ చాలా ఏళ్ళ తరువాత బాహాటంగా ఒక పెళ్ళిలో కలిశారు. చెన్నైలో జగన్ అన్న కొడుకు వివాహానికి ఎంతో మంది అతిరధ మహారధులు వచ్చారు. వారిలో కేవీపీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేవీపీ జగన్ కలసి మాట్లాడుకున్నారు. ఆ సన్నివేశం అందరికీ ఆకట్టుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవీపీ జగన్ అంత సన్నిహితంగా ఆనందంగా మాట్లాడుకోవడం ఆ మధ్య కాలంగా ఎవరూ చూసింది లేదు, దాంతో అది పెద్ద చర్చగా మారింది.

పదిహేను రోజుల తేడాలో :

ఇదిలా ఉంటే బెంగళూరు కేంద్రంలో కేవీపీతో జగన్ చర్చలు జరిపారు అని తాజాగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. వైసీపీ ఓటమి చెందాక గత ఇరవై నెలలుగా జగన్ బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలు అన్నీ అక్కడ నుంచే అమలు చేస్తున్నారు. ఇక జగన్ కూడా తన రాజకీయ పంధాను మార్చారు. గతానికి భిన్నంగా అందరినీ కలుపుకుని పోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్సార్ కి సన్నిహితులకు పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను అంకుల్ గా పిలిచే కేవీపీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు అన్న గాసిప్స్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వైసీపీ విషయంలో సూచనలు సలహాలు కూడా కేవీపీ జగన్ కి ఇచ్చారు అని అంటున్నారు.

కాంగ్రెస్ లో ఉంటున్నా :

ఇదిలా ఉంటే కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ తరఫున ఏకంగా 12 ఏళ్ల పాటు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2020లో ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటున్నారు కానీ వయసు రిత్యా గతం అంతా చురుకుగా లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో జగన్ భేటీలు వేస్తున్నారు అన్నది అయితే పుకార్లుగా విన వస్తోంది. కేవీపీ మంచి వ్యూహకర్త అన్న సంగతి తెలిసిందే. ఆయన వైఎస్సార్ కి ప్రియమైన స్నేహితుడు. దాంతో తన స్నేహితుడి కుమారుడు అయిన జగన్ రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దిశా నిర్దేశం చేస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు జగన్ కూడా మాస్టర్ ప్లాన్స్ తోనే రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి కేవీపీతో భేటీ అంటే కాంగ్రెస్ తో ఇండియా కూటమితో కలయికనా లేక ఏపీలో వైసీపీని బలోపేతం చేసుకుంటూ న్యూట్రల్ గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో 2029 నాటి పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ స్టెప్ వేస్తుందా అన్న చర్చ కూడా ఉంది.

Tags:    

Similar News