మోడీని కిల్లర్ అన్న ట్రంప్!
నరేంద్ర మోడీ భారత ప్రధాని, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్. ఈ ఇద్దరూ జీ 7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ లో మీట్ అయ్యారు. చాలా కాలం తరువాత కలిసిన ఈ ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.
నరేంద్ర మోడీ భారత ప్రధాని, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్. ఈ ఇద్దరూ జీ 7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ లో మీట్ అయ్యారు. చాలా కాలం తరువాత కలిసిన ఈ ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ మోడీని ప్రశంసించారు. ఆయన నేనూ మంచి మిత్రులం అన్నారు. అంతే కాదు మోడీ గురించి ఆయన నాయకత్వ లక్షణాల గురించి కూడా ట్రంప్ తనదైన శైలిలో మీడియాకు చెప్పుకొచ్చారు.
చూసేందుకు ఏంజెల్ గా ఉన్నా :
ఇక మోడీ చూసేందుకు ఏంజెల్ గా అందంగా ఉన్నా కూడా ఆయన ఒక టఫ్ నెగోషియేటర్ అని ట్రంప్ అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అలా అంటున్న సమయం లో పక్కనే ఉన్న మోడీ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. ఇక హౌ డూ యూ మోడీ అని తాము కార్యక్రమాలు నిర్వహించామని కూడా గుర్తు చేసుకున్నారు. మోడీ ఎందరినో తనదైన నాయకత్వ లక్షణాలతో ఆశ్చర్యపరుస్తారు అని కూడా ట్రంప్ అన్నారు.
ఆయన కఠినం అంటూ :
అంతే కాదు మోడీని ట్రంప్ కఠినమైన వ్యక్తిగా కూడా సంభోదిస్తూ ప్రశంసలు కురిపించారు. మోడీ లాంటి వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు అని ట్రంప్ అన్నారు. ఆయనను మంచి మనిషి అని ప్రజలు అంటారని అయితే ఆయన టఫెస్ట్ అని ట్రంప్ పదే పదే చెప్పారు. తనకు భారత ప్రధాని మోడీ అంటే అపారమైన గౌరవం ఉందని అన్నారు. ఇక తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇండియాకు వైట్ హౌస్ లో ఒక గొప్ప స్నేహితుడు ఉంటాడని కూడా ట్రంప్ చెప్పడం విశేషం.
మోడీ పీఎం గా ఉంటేనే :
ఇక ట్రంప్ మరో మాట చెప్పారు. ఇండియా మీద ఏ దాడి జరిగినా తాము ఆ దేశానికి అండగా ఉంటామని హెల్ప్ చేస్తామని అన్నారు. అయితే దానికి షరతులు వరిస్తాయన్నట్లుగా మోడీ ప్రధానిగా ఉన్నంతవరకే అని మెలిక పెట్టారు. మోడీ ప్లేస్ లో భారత్ లో ఇంకో లీడర్ ఉంటే మాత్రం అమెరికా వైఖరి చెప్పలేమని అన్నారు. మోడీ నాయకుడిగా ఉన్నంతవరకూ అమెరికా మంచి మిత్రుడిగా ఉంటుందని ట్రంప్ అన్నారు. హార్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నవికులు చనిపోవడం గురించి విన్నాను అని ట్రంప్ అన్నారు. ఎ విషయంలో తాము భారత్ లో కలసి చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
ఆంక్షలు ఉండరాదు :
ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు లేని స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భేటీలో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమయినపుడు కీలక వ్యాఖ్యలే చేశారు. హర్మూజ్ జలసంధి వద్ద వేలాది మంది భారత నావికుల భద్రతే తమకు ముఖ్యమని వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేశారని మోడీ అన్నారు. హర్మూజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందని ప్రధానమంత్రి మోడీ చెప్పడం విశేషం.