• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  ఆయుష్షును హరిస్తున్న...

ఆయుష్షును హరిస్తున్న నిద్రలేమి.. రోగాలతో పాటు మరెన్నో!

| రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన బాడీ రీఛార్జ్ అయ్యే ఛాన్స్ కోల్పోతుంది. లాంగ్ టర్మ్‌లో ఈ అలవాటు ఇలాగే కొనసాగితే అది నేరుగా మన జీవితకాలాన్ని తగ్గించేస్తుంది.

By - Madhu Reddy
Update: 2026-06-17 13:30 GMT

ఈరోజు అస్సలు నిద్రపోలేదు తెలుసా! అని చాలామంది ఏదో గొప్పగా, ఒక పర్సనాలిటీ ట్రైట్‌లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ, ప్రస్తుత తరం మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటోందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు సరిగ్గా నిద్రపోవడం లేదు. లైట్‌గా తీసుకునే ఈ అలవాటు మన ఆయుష్షును తగ్గించడమే కాకుండా, ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకుంటోందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

ఆయుష్షును హరించేస్తున్న నిద్రలేమి:

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన బాడీ రీఛార్జ్ అయ్యే ఛాన్స్ కోల్పోతుంది. లాంగ్ టర్మ్‌లో ఈ అలవాటు ఇలాగే కొనసాగితే అది నేరుగా మన జీవితకాలాన్ని తగ్గించేస్తుంది. నిద్రలేమి కారణంగా మహిళల ఆయుష్షు దాదాపు 4.7 సంవత్సరాలు, అలాగే పురుషుల ఆయుష్షు 2.4 సంవత్సరాల వరకు తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక మనం నిద్రను నిర్లక్ష్యం చేస్తే, మన జీవితాన్ని మనమే చేతులారా తగ్గించుకున్నట్టే.

డయాబెటిస్ రిస్క్ 57 శాతం ఎక్కువ:

సరిగ్గా నిద్రపోని వారి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తారుమారవుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇక ఎవరైతే రోజుకు సరిపడా నిద్రపోరో, వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఏకంగా 57 శాతం పెరుగుతుంది. ఇక అందుకే షుగర్ వ్యాధి బారిన పడకూడదనుకుంటే కేవలం డైటింగ్ మాత్రమే కాదు, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం.

గుండెకు ముంచుకొస్తున్న ముప్పు:

గుండె జబ్బులకు, నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనం నిద్రపోతున్నప్పుడు మన బ్లడ్ ప్రెజర్ సహజంగానే తగ్గుతుంది. కానీ నిద్ర లేకపోతే గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇక దీనివల్ల హార్ట్ ఎటాక్ మరియు ఇతర గుండె జబ్బులు వచ్చే రిస్క్ 5 నుంచి 20 శాతం వరకు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె పదిలంగా ఉండాలంటే బాడీకి సరైన విశ్రాంతి ఇవ్వక తప్పదు.

బ్రెయిన్ పవర్ డౌన్.. డిమెన్షియా డేంజర్:

రాత్రి పూట మన మెదడు తనను తాను క్లీన్ చేసుకుంటుంది. మనం సరిగ్గా నిద్రపోనప్పుడు బ్రెయిన్‌లో హానికరమైన వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇక ఇది కాలక్రమేణా జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి దారితీస్తుంది. అంతేకాదు, వయసు పైబడిన తర్వాత వచ్చే మతిమరుపు వ్యాధి అయిన ‘డిమెన్షియా’ వచ్చే అవకాశాలను కూడా ఈ నిద్రలేమి సమస్య బాగా పెంచేస్తుంది.

బాగా నిద్రపోవడాన్ని బద్ధకంగానో లేదా టైం వేస్ట్‌గానో చూడటం ఇకనైనా ఆపాలి. నిద్ర అనేది మన శరీరానికి ఒక బెస్ట్ మెడిసిన్ లాంటిది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్రను ఒక లగ్జరీగా కాకుండా, మన ఆరోగ్యానికి కనీస అవసరంగా మార్చుకోవాలి. ఈ రోజే ఫోన్‌ను పక్కన పెట్టి, టైమ్‌కు పడుకునే అలవాటు చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

Tags:    
  • sleephealth 
  • sleepdeprivation 
  • healthtips 
  • lifestyle 
  • wellness 
  • mentalhealth 
  • hearthealth 

Similar News

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

2026-10-08 07:08 GMT

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

2026-10-05 04:34 GMT

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీకు పిల్లలు పుట్టరు..

2026-10-03 12:44 GMT

న్యూరాలింక్‌తో ఆలోచనలే మాటలయ్యాయి.. మాట కోల్పోయిన వారికి కొత్త ఆశ

2026-09-19 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS