కర్నూలు బస్సు ప్రమాదం... వీ.కావేరీ ట్రావెల్స్ యజమాని ఏమన్నారంటే..!

శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్‌ లో వీ.కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-24 13:59 GMT

శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్‌ లో వీ.కావేరీ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో... ఈ ప్రమాదంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ బస్సుకు ఫిట్‌ నెస్‌ సర్టిఫికేట్ లేదని, ఉన్న సర్టిఫికేట్లు కాల పరిమితిని దాటాయని, అనేక చలాన్లు ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ట్రావెల్స్ యజమాని స్పందించారు.

అవును... కర్నూలు జిల్లాలో వీ.కావేరీ బస్సు ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 22 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనపై వేమూరీ కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం స్పందించింది. ఇందులో భాగంగా సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు మాట్లాడారు.

ఇందులో భాగంగా... వర్షంలో బైక్ పై వచ్చిన వ్యక్తి సడన్ గా పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వేమూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఆ సమయంలో ముందుగా మెయిన్ డోర్ వద్ద ఒకేసారి మంటలు రావడం వల్ల డోర్ దగ్గరకు రావడానికి ఎవరూ సాహసించలేదని అన్నారు. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడేసరికి బ్యాక్ డోర్ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. ఇదే సమయంలో బస్సు సర్టిఫికెట్లపై జరుగుతున్న ప్రచారంపైనా ఆయన స్పందించారు.

తమ బస్సుకు సంబంధించిన పేపర్స్ వేల్యూ లేవని పుకార్లు పుట్టిస్తున్నారని.. బస్సుకు సంబంధించిన అన్ని పేపర్లూ వేలీడ్ లోనే ఉన్నాయని.. ఇన్స్యూరెన్స్, ఫిట్ నెస్ వేల్యూలోనే ఉందని అన్నారు. ఈ క్రమంలో.. ఫిట్ నెస్ సర్టిఫికెట్ 31 మార్చి 2027 వరకూ ఉందని.. ఇన్స్యూరెన్స్ వేల్యూ 2026 ఏప్రిల్‌ 20 వరకు ఉందని తెలిపారు. రోడ్ ట్యాక్స్ 31 మార్చి 2026వరకూ ఉందని అన్నారు.

ఈ సందర్భంగా తమ బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ ఇన్సూరెన్స్ చేయబడి ఉందని.. తమ సంస్థ తరుపున ప్రతిఒక్కరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని వి.కావేరీ ట్రావెల్స్ సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు తెలిపారు.

కాగా... ప్రమాదానికి గురైన ఈ బస్సు 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు 16 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సుపై 16 చలాన్లు ఉండగా.. రూ.23,120 ఫైన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. ఇదే క్రమంలో.. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌ లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడగా.. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినట్లు తెలిసింది.

Tags:    

Similar News