పిల్లల్లేరు.. ఆర్థిక సమస్యలతో కత్తులతో పొడుచుకున్న దంపతులు

Update: 2025-08-31 05:29 GMT

పిల్లలు పుట్టలేదని..ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్న వేళ.. వాటి నుంచి బయట పడేందుకు ఆత్మహత్య మాత్రమే మార్గంగా భావించిన దంపతుల ఉదంతం ఒకటి షాకింగ్ గా మారింది. కుకట్ పల్లి (కేపీహెచ్ బీ)కి చెందిన ఈ దంపతులు కత్తులతో పొడుచుకోవటం.. అందులో భర్త చనిపోగా.. భార్య గాయాలతో ప్రాణాపాయం తప్పటం లాంటి పరిణామాలు స్థానికంగా సంచలనమైనంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

పదిహేడేళ్ల క్రితం గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన 45 ఏళ్ల రామక్రిష్ణకు.. 38 ఏళ్ల రమ్యక్రిష్ణకు పెళ్లైంది. వీరికి పిల్లలు లేకపోవటం.. రామక్రిష్ణారెడ్డి గతంలో రెస్టారెంట్ పెట్టి అప్పులు పాలు అయ్యారు. కరోనా సమయంలో చికిత్సకు రూ.20 లక్షలు అప్పు చేశారు. ఇటీవల కాలంలో రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయి. దీన్ని భరించలేని వారు.. మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా కూరగాయల కత్తితో ఇద్దరూ ఒకేలా చేతులు.. గొంతు.. పొట్టపై కోసుకున్నారు. ఈ క్రమంలో రామక్రిష్ణారెడ్డి తీవ్ర రక్త స్రావంతో మరణించారు.అయితే..ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న రమ్యక్రిష్ణ.. డయల్ 100కు.. అడ్డగుట్టలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో ఆమెను రక్షించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారమే రామక్రిష్ణారెడ్డి చనిపోయి.. పడిపోయిన తర్వాత కూడా రమ్యక్రిష్ణ ఒంటరిగా ఇంట్లో ఉండటం.. శనివారం ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన వివరాలు భిన్నంగా ఉండటంతో అసలేం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తొలుత తాను భర్తను పొడిస్తే..భర్త తనను పొడిచినట్లుగా చెప్పిన ఆమె.. ఆ తర్వాత మాట మార్చిన ఆమె భర్త తనను పొడిచి.. ఆయనకు ఆయన పొడుచుకున్నారని.. భిన్నమైన వ్యాఖ్యలు చేయటంతో ఆమెను విచారిస్తున్నారు. ఆత్మహత్య అని చెబుతున్నప్పటికీ.. అనుమానరీతిలో మాట్లాడుతున్న మాటల నేపథ్యంలో హత్యకేసుగా నమోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News