కృష్ణా జిల్లా ప‌రిష‌త్‌లో పొలిటిక‌ల్ సెగ‌.. !

ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు గ్రామ స్థాయి నుండి క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ గెలుపు ల‌క్ష్యాల‌ను నిర్దేశించు కుంటున్నారు.

Update: 2026-09-12 12:30 GMT

కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం జోరుగా సాగుతోంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎన్ని క‌ల విష‌యంలో కీల‌క‌మైన వైసీపీ నాయ‌కులు పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు బ‌లంగా స్పందించాల‌ని నిర్ణయించారు. ఇక‌, కూట‌మి పార్టీలు కూడా జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. మంత్రి కొల్లు ర‌వీం ద్ర‌, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు, జ‌న‌సేన ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ వంటివారు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు. దీంతో జిల్లా రాజ‌కీయాలు వేడెక్కాయి.

2021లో ఎన్నికైన ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను గ‌మ‌నిస్తే.. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌ల సంగ్రామం కావ‌డంతో జెడ్పీ నియోజకవర్గాల బ‌ల‌మైన ఆధిప‌త్యాలు చూపించేందుకు నాయ‌కులు రెడీగా ఉన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ హవాను అలాగే కొనసాగించి జిల్లా పరిషత్‌ పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు గ్రామ స్థాయి నుండి క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ గెలుపు ల‌క్ష్యాల‌ను నిర్దేశించు కుంటున్నారు. 2021 పరిషత్ ఎన్నికలలో జిల్లాలోని 46 జ‌డ్‌పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 44 స్థానాల్లో ఏకపక్ష విజయం సాధించింది. అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కుల‌పై దాడులు చేశార‌న్న వాద‌న ఉంది. ఇక‌, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుత ఓటమి నేపథ్యంలో పార్టీ బలాన్ని కాపాడుకోవడం సవాల్‌గా మారింది. పాత క్యాడర్‌ను తిరిగి యాక్టివ్ చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో తమ పట్టును నిరూపించుకో వాలని పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వం ముందుగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి, ప్రజా స్పందనను చూశాకే గ్రామీణ స్థానిక సంస్థల (జెడ్పీటీసీ, పంచాయతీ) ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ కూట‌మి నాయ‌కులు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రోవైపు వైసీపీ నేత‌లు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. పార్టీ కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసి.. తాము బ‌ల‌హీనంగా లేమ‌న్న సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Tags:    

Similar News