పంతం పట్టి సంక్రాంతికి వచ్చిన క్రిష్ణ మూవీ .... రిజల్ట్ చూస్తే షాక్ !

ఇక క్రిష్ణను సూపర్ స్టార్ చేసింది ఊపిరి పోసింది సంక్రాంతి పండుగే అని చెప్పాలి. అయితే ఆ సెంటిమెంట్ బలపడింది 1976లోనే.;

Update: 2026-01-11 02:30 GMT

సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి ఎంతో ఇష్టమైనది. ప్రీతిపాత్రమైనది. పల్లెలన్నీ కళకళలాడేది. ఇంకా చెప్పాలీ అంటే విందులూ వినోదాలకు ఎంతో ముఖ్యమైనది. ఇక ఒక్కసారి యాభై ఏళ్ళకు వెనక్కి వెళ్తే సంక్రాంతి అప్పట్లో ప్రతీ లోగిళ్ళలో అద్భుతంగా సాగింది. ఆనాడు ఎక్కడా టీవీలు లేవు, ఆ మాటకు వస్తే ఫ్యాన్స్ కూడా లేవు. కరెంట్ కూడా తక్కువ ఇళ్ళకు ఉండేది. రేడియో ఉంటే గొప్ప అన్నట్లుగా అనిపించేది అలాంటి పరిస్థితులలో సినిమాలే జనాలకు అత్యంత ముఖ్య వినోదం. హీరోలు అంతా వారికి వెండి తెర వేలుపులు. అందుకే ఆ రోజులలో ఏ సినిమా అయినా అధిక లాభాలు చూసిందే తప్ప పెద్దగా నష్టాలు అయితే లేవు అని చెబుతారు. ఎన్ని సినిమాలు వచ్చినా థియేటర్లు కిటకిట లాడే నేపథ్యం ఉంది.

క్రిష్ణకు ఊపిరి పోసింది :

ఇక క్రిష్ణను సూపర్ స్టార్ చేసింది ఊపిరి పోసింది సంక్రాంతి పండుగే అని చెప్పాలి. అయితే ఆ సెంటిమెంట్ బలపడింది 1976లోనే. అప్పటికి వరస ఫెయిల్యూస్ తో క్రిష్ణ ఉన్నారు. ఆయన నూరవ చిత్రం అల్లూరి సీతారామరాజు 1974 మే 1న రిలీజ్ అయి బీభత్సంగా ఆడేసింది. క్రిష్ణలోని మహా నటుడిని బయటకు తీసిన చిత్రం అది. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా క్రిష్ణ నటన ఆ సినిమాలో సాగింది. దాంతో క్రిష్ణ ప్రభంజనం ఒక్క లెక్కన సాగింది. అయితే అల్లూరి సీతారామరాజు మూవీ తరువాత క్రిష్ణకు రెండేళ్ళ పాటు మరో హిట్ కాదు కదా ఏవరేజ్ మూవీ కూడా పడలేదు అంటే ఆ సినిమా ప్రభావం జనాల్లో ఎంతగా ఉందో అర్ధం చేసుకోవాలి. పెద్ద ఎత్తున సినిమాలు ఫెయిల్ అవుతున్న దశలో పట్టుదలగా క్రిష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయా మూవీస్ పతాకం మీద తీసిన చిత్రమే పాడి పంటలు.

సంక్రాంతి మొనగాడుగా :

పాడి పంటన్లు క్రిష్ణ పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో తీశారు. రైతుల సమస్యలు వ్యవసాయానికి నీటి కొరత. గ్రామాలలో వైష్యమాలు ఇలా రైతు చుట్టూ కధ అల్లుతూ పాడి పంటలతోనే పల్లెలు దేశం బాగుంటాయని ఒక అధ్బుతమైన సందేశాన్ని ఇస్తూ మూవీని తెరకెక్కించారు. రికార్డు టైం లో ఈఎ మూవీని ఆయన తీశారు. ఈ మూవీకి కధా బలం సంగీత బలం ఆర్టిస్టుల ఎంపిక అన్నీ కుదిరాయి. కానీ క్రిష్ణకు హిట్ వచ్చి రెండేళ్ళు గడచిపోయింది. దాంతో ఈ సినిమాలు జనాలు ఆదరిస్తారా లేదా అని చాలా మందికి డౌట్. పైగా సంక్రాంతికి అగ్ర నటుల మూవీస్ క్యూ కట్టాయి. దాంతో క్రిష్ణను వేరే సేఫ్ డేట్ కి మూవీని రిలీజ్ చేయమని శ్రేయోభిలాషులు కోరారుట. అయినా ససేమిరా అంటూ క్రిష్ణ 1976 జనవరి 14న పాడి పంటలు మూవీని రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ ఏడాది సంక్రాతి మొనగాడుగా ఆయన నిలిచారు.

అగ్ర హీరోల వార్ :

అదే ఏడాది సంక్రాంతికి శోభన్ బాబు నటించిన పిచ్చి మారాజు మూవీ రిలీజ్ అయింది జగపతి ఆర్ట్ పిక్చర్స్ వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ తీసిన సినిమా అది. అలాగే రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకం మీద ఎన్టీఆర్ బాలక్రిష్ణతో కలసి తీసిన సినిమా వేములవాడ భీమకవి కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది. అదే విధంగా ఇతర హీరోల సినిమాలు వచ్చాయి. అయితే వీటిని అన్నింటినీ పక్కన పెట్టి పాడి పంటలు ఏకగ్రీవంగా బంపర్ హిట్ అనిపించుకుంది. దాంతో ఆ ఏడాది మాత్రమే కాదు తరువాత వచ్చిన ప్రతీ సంక్రాంతికి క్రిష్ణ సినిమాను రిలీజ్ చేయడం హిట్ కొట్టడం ఒక ఆనవాయితీగా మారింది అని చెప్పాలి.

Tags:    

Similar News