కోమటిరెడ్డి ఆశే కానీ.. మంత్రికన్నా ఎమ్మెల్యేనే బెటరట!
మంత్రి వర్గంలో తనకు చోటు దక్కలేదని, తనకు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని.. నెరవేర్చలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరోపిస్తున్నారు.;
మంత్రి వర్గంలో తనకు చోటు దక్కలేదని, తనకు మంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టారని.. నెరవేర్చలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆరోపిస్తున్నారు. అధిష్టానం కూడా తనకు ఆశ కల్పించిందని అంటున్నారు. కానీ, కొందరు తనకు అడ్డు పడ్డారన్నది ఆయన వాదన, ఆవేదనగా ఉంది. దీనిపై ఇటీవల నాలుగు రోజులుగా మీడియా ముందు ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మోజున్నా.. ఈ విషయంపై చాలా మంది విస్తుబోతున్నారు.
'మంత్రిపదవిలో ఏముందిలే అన్నా!' అనేస్తున్నారు. దీనికి కారణం.. ఎమ్మెల్యేలైతే.. హ్యాపీగా ఉండొచ్చని మంత్రి అయితే లేనిపోని టెన్షన్ తప్ప మరేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులు పడుతున్న ఇబ్బందులు.. గమనిస్తే ఎమ్మెల్యేగా ఉంటేనే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. నిజానికి మంత్రులుగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని శాఖల్లో నిధులు లేవు. పనులు చేసేందుకు ఆదేశాలు ఇస్తున్నారే తప్ప .. ఆయా పనులుపూర్తి చేసేందుకు సొమ్ములు లేక మంత్రులు విలవిల్లాడుతున్నారు.
మరికొన్ని శాఖల్లో అయితే.. ఉన్నతాధికారులే చక్రం తిప్పుతున్నారు. దీంతో మంత్రులుగా ఉన్న వారు కేవలం సంతకాలు మాత్రమే పెడుతున్నారు. దీంతో మంత్రి వర్గంలో ఉన్నవారిలో సగం మంది తమకు పెద్దగా పని ఉండడం లేదని, కానీ టెన్షన్ మాత్రం ఉంటోందని చెబుతున్నారు. ఈ పరిణామాలతోనే మంత్రి వర్గంలో చోటు కన్నాకూడా ఎమ్మెల్యేగా ఉండిపోవడమే బెటర్ అనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. కానీ, కోటమిరెడ్డి మాత్రం తన దూకుడు ఎక్కడా తగ్గించడం లేదు.
పైగా పట్టుబట్టి.. దానిని సాధించేందుకు.. ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి లేఖ కూడా రాసినట్టు సమాచారం. దీనిపై కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడితే.. మరికొందరు అంతర్గతంగా విభేదిస్తున్నా రు. ఎలా చూసుకున్నా.. కోమటిరెడ్డికి మంత్రి పదవి వ్యవహారం ప్రస్తుతం హాట్‌గానే ఉంది. ఇక, ఆయన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం.. ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి తనకులేదని చెప్పేస్తున్నారు. సో.. ఇదీ సంగతి. మరి రాజగోపాల్ రెడ్డి ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.