'రేపిస్టును ఉరితీయాలి'... గ్యాంగ్‌ రే*ప్ ప్రధాన నిందితుడి పాత పోస్ట్ వైరల్!

అవును... 2024 ఆగస్టు 8-9 తేదీలలో రాత్రి అర్జీ కర్ మెడికల్ కాలేజీ కం హాస్పటల్ లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-30 09:30 GMT

పశ్చిమ బెంగాల్‌ లోని కలకత్తా లా కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన.. సుమారు ఏడాది క్రితం కోల్‌ కతాలోని ఆర్‌జి కర్ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసును గుర్తుకు తెస్తోంది. లా కాలేజీ కేసులోని ప్రధాన నిందితుడిగా చెబుతున్న మిశ్రా... ఆర్జీ కర్ ఘటన సమయంలో... పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.


అవును... 2024 ఆగస్టు 8-9 తేదీలలో రాత్రి అర్జీ కర్ మెడికల్ కాలేజీ కం హాస్పటల్ లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ సమయంలో... నేటి ఇటీవలి లా కాలేజీ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మిశ్రా, 'అత్యాచారం కేసులో దోషులకు మరణశిక్ష విధించాలి' అని డిమాండ్ చేశాడు.

దీనికి సంబంధించిన ఫేస్‌ బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. గత సంవత్సరం కోల్‌ కతాలో జరిగిన ఆర్‌జి కర్ సంఘటన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించిన మిశ్రా.. అత్యాచార నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. "రేపిస్టును ఉరితీయాలి, న్యాయం కావాలి, నాటకం కాదు, తక్షణ న్యాయం కావాలి, దోషులను ఉరితీయాలని నేను కోరుకుంటున్నాను" అని రాశారు.

కాగా... కోల్‌ కతాలోని లా కాలేజీలో జూన్ 25న జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, ఇద్దరు సీనియర్ విద్యార్థులు ప్రమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్ ఉన్నారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఒకరిని కూడా అరెస్టు చేశారు.

బాదితురాలి ఫిర్యాదు ప్రకారం.. లా కాలేజీ విద్యార్థినిని క్యాంపస్‌ లోని గార్డ్ రూమ్‌ కు ఈడ్చుకుంటూ వెళ్లారు! దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు గార్డ్ రూమ్‌ లో బందించి సుమారు మూడు గంటల పాటు లైంగికంగా, దారుణంగా దాడి చేసి, హింసించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం... బాధితురాలి మెడ, ఛాతితో పాటు ప్రైవేట్ పార్ట్స్ పైనా గాయాలు కనిపించాయి! ఈ ఘోరం తర్వాత నిందితుడు ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాడు! ఇందులో భాగంగా.. ఆమె ప్రియుడిని చంపేస్తామని, ఆమె తల్లిదండ్రులను తప్పుడు కేసులో ఇరికిస్తానని చెప్పి ఆమెను బెదిరించాడు!

Tags:    

Similar News