ఛాతీకి బెల్ట్ తో కొడాలి నానీ.. కొత్త పిక్ చూశారా?

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకున్న కొడాలి నాని ఇటీవల కేవలం ఒక్క సందర్భంలోనే బయట ప్రపంచానికి కనిపించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-02 07:34 GMT

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకున్న కొడాలి నాని ఇటీవల కేవలం ఒక్క సందర్భంలోనే బయట ప్రపంచానికి కనిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న సమయంలో మే 23న హైదరాబాద్ లోని ఓ వివాహ వేడుకలో కనిపించారు. ఈ క్రమంలో.. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పిక్ తెరపైకి వచ్చింది.

అవును... మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానీ ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే! మరోపక్క నానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇలా నానీపై అనేక కేసులు నమోదు కావడంతో.. దేశం విడిచి పారిపోతారనే ఊహాగాణాల నడుమ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్ లోని ఓ వేడుకలో కనిపించారు.

ఆ సమయంలో ఆపరేషన్ అనంతరం ఆయన చాలా సన్నగా కనిపించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కొడాలి నానీకి సంబంధించిన పిక్స్ నెట్టింట దర్శనమిచ్చాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కొడాలితో ఆయన అభిమాని ఒకరు సెల్ఫీ తీసుకున్నారు! ఆ ఫోటోల్లో బాగా బరువుతగ్గి, సన్నగా కనిపిస్తున్న నాని.. ఛాతికి ఒక సపోర్టింగ్ బెల్ట్ ధరించి కనిపించడం గమనార్హం!

ఇలా ఛాతీకి సపోర్ట్ గా ఒక బెల్ట్ లాంటి పరికరాన్ని ధరించి కనిపించడంతో.. బహుశా ఇటీవల గుండె ఆపరేషన్ కారణంగానే అయ్యి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు ఈ పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వాస్తవానికి కొడాలి నానీపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో.. ఆయనను ఏపీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన దేశం దాటి పోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు! అయితే... గుండె ఆపరేషన్ నుంచి కొడాలి నాని ఇంకా కోలుకుంటున్నందువల్ల ఏపీ పోలీసులు సంయమనం పాటిస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News