ఉత్తరాంధ్ర కు అద్భుత వరం

అందులో బ్రాకో థెరపీ యూనిట్ ద్వారా ఐసీఆర్ అదే విధంగా ఐఎల్‌ఆర్‌టీ, ఐఎస్‌బీటీ, మెల్డ్ థెరపీ వంటి వైద్య సేవలు పేద రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.;

Update: 2025-09-01 22:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అతి పెద్ద వరాన్ని ప్రసాదించింది. ఉత్తరాంధ్ర మాత్రమే కాదు పొరుగు రాష్ట్రాలకు ఎంతో మేలు చేసే కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. ఉత్తరాంధ్రకు పెద్దాసుపత్రిగా ఉన్న కింగ్ జార్జి ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి విషయంలో ఎంతో కీలకంగా పనిచేసే ఈ ఆధునిక వైద్య విభాగాలను ఏకంగా నలభై కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కూటమి ప్రభుత్వం అప్పగించింది

ఖరీదైన వైద్యం ఉచితంగా :

సాధారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే వైద్యం కోసం అయ్యే ఖర్చులు వేలలో లక్షలలోనే ఉంటాయి. అయితే కేజీహెచ్ కి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మూడు అత్యాధునిక వైద్య పరికరాలతో వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఇది ఎంతో మంది పేదలకు ఉపయుక్తంగా ఉంటుంది. కేజీహెచ్ కి వచ్చే రోగులతో పాటుగా ఎన్టీఆర్ వైద్య సేవా పధకం కింద వచ్చే రోగులకు కూడా ఉచితంగా ఈ ఖరీదైన వైద్యం ఉచితంగా లభిస్తుంది.

కీలకమైన సేవలు అందుబాటులోకి :

ఈ అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా కీలకమైన వైద్య సేవలు పేదలకు సులువుగా దక్కుతాయి. అందులో బ్రాకో థెరపీ యూనిట్ ద్వారా ఐసీఆర్ అదే విధంగా ఐఎల్‌ఆర్‌టీ, ఐఎస్‌బీటీ, మెల్డ్ థెరపీ వంటి వైద్య సేవలు పేద రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. అంతే కాదు ఈ సేవలలలో ఇంట్రా కేవిటీ రేడియేషన్, ఇంట్రా లూమినల్ రేడియో థెరపీ, ఇంటర్ స్టీటియల్ బ్రాచి థెరపీ వంటివి కూడా ఉంటాయి. దాంతో అత్యాధునిక వైద్య చికిత్సలను కేజీహెచ్ అందించబోతోంది. అదే విధంగా చూస్తే కనుక లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక 3డీ సీఆర్‌టీ, ఐఎంఆర్‌టీ, ఐజీఆర్‌టీ వంటి రేడియోథెరపీ విధానాలతో పాటుగా మెదడు కణితులకు ఎస్‌ఆర్‌ఎస్, ఎస్‌బీఆర్‌టీ చికిత్సలు కూడా చేయనున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతే కాదు సీటీ స్టిమ్యులేటర్‌ ద్వారా కూడా క్యాన్సర్‌ బారినపడిన వారికి అవసరమైన స్కానింగ్‌ పరీక్షలు చేస్తారని చెబుతున్నారు.

క్యాన్సర్ ఇక నయం :

క్యాన్సర్ భయం అన్నది ఎవరికీ అవసరం లేదని అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సేవల ద్వారా పూర్తిగా నయం అవుతుందని కేజీహెచ్ వైద్య వర్గాలు తెలిపాయి ఇక మీదట కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చే రోగులకు కేజీహెచ్‌లో అన్ని రకాల రేడియో థెరపీ సేవలను అందించడం జరుగుతుందని అంటున్నారు. ఈ కొత్త పరికరాలతో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వచ్చినా నయం చేయవచ్చు అని భరోసా ఇస్తున్నారు. కేజీహెచ్ లో ప్రస్తుతం టెలీ కోబాల్డ్ యంత్రంతో రేడియేషన్ చికిత్స చేస్తున్నారని ఇపుడు దాని స్థానంలో కొత్త యంత్రాలు వచ్చాయని చెబుతున్నారు. మొత్తానికి ఇది ఉత్తరాంధ్రా ప్రజలు అందరికీ ఎంతో మేలైన వార్తగా చెబుతున్నారు.

Tags:    

Similar News