కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం!

ఈ సమయంలో ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-08 05:50 GMT

గతకొన్ని రోజులుగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రాణాంతక కరోనా వైరస్ ను నిర్మూలించడానికి తయారుచేసిన ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరిగాయని.. రక్తం కడ్డకట్టడం, వైట్ ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయనే విషయం తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ప్రాణాంతక కరోనా వైరస్‌ ను నిర్మూలించడానికి తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక కనిపించదు! గతకొన్ని రోజులుగ దీని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు మొదలైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై తయారీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది!

ఈ క్రమంలో తాజాగా స్పందించిన ఆస్ట్రాజెనెకా... తాము ఉత్పత్తి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌ లో అప్‌ డేటెడ్‌ టీకాలు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్‌ వ్యాక్స్‌ జెవ్రియాకు గిరాకీ తగ్గిందని అంగీకరించింది.

కాగా... ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా... తమ వ్యాక్సిన్‌ వల్ల చాలా అరుదుగా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చని తెలిపింది.

Tags:    

Similar News