కొడంగల్ లో కేసీఆర్... రేవంత్ సీఎం పోస్ట్ పై కామెంట్స్ వైరల్!

అవును... ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రచార కార్యక్రమాల్లో మరింత డోస్ పెంచారు. ఇందులో భాగంగా తాజాగా కొడంగల్‌ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.

Update: 2023-11-22 11:41 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారాలను హోరెత్తించేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ అధినేత, సీఎం కేసీఆర్ కొండంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలమైన హామీలు ఇస్తూనే మరోవైపు రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రచార కార్యక్రమాల్లో మరింత డోస్ పెంచారు. ఇందులో భాగంగా తాజాగా కొడంగల్‌ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్హంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది అని అన్నారు. అనంతరం... రేవంత్‌ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే అని తెలిపారు!

అనంతరం... తాను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పిన కేసీఆర్... రైతుల బాధలు తనకు తెలుసని.. కాంగ్రెస్‌ నేతలకు అసలు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని అన్నారు. ఇక, రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా.. పొలం దున్నారా అని ప్రశ్నించిన కేసీఆర్... వ్యవహాసం గురించి తెలియకే అలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదే సమయంలో... కొడంగల్‌ లో రేవంత్‌ రెడ్డి పెద్ద భూకబ్జాదారని.. కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి పనులు చేయలేదని.. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు అని.. ఆయన టికెట్లు అమ్ముకున్నారని సొంతపార్టీ నేతలే అంటున్నారని కేసీఆర్ ఫైరయ్యారు. అదేవిధంగా... తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లారని అన్నారు.

ఇదే క్రమంలో నోటుకు ఓటు వ్యవహారాన్ని గుర్తుచేసిన కేసీఆర్... రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన తీరును మీరంతా టీవీల్లో చూశారు.. దీని గురించి ఎవరైనా అడిగితే.. అలా దొరికిపోవడం మెడల్‌ రావడంతో సమానం అని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలా నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి... సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

ఇక ఇలాంటి రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌ లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చిన కేసీఆర్... ఎవరికి వారే తానే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌ లో 15 మంది ఉన్నారని ఎద్దేవా చేశారు! అనంతరం... అసలు కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది.. కొడంగల్‌ లో పనిచేసే నరేందర్‌ రెడ్డి కావాలా.. వట్టిమాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా ప్రజలే తేల్చుకోవాలి అని కేసీఆర్‌ కోరారు.

Tags:    

Similar News