ఎన్నికలకు సబ్జెక్ట్ లేక కేసీఆర్ ఏం చేస్తున్నారంటే...!
పార్లమెంటు ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. మరో మూడు వారాల్లో .. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంచనాలు వస్తున్నాయి.;
పార్లమెంటు ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. మరో మూడు వారాల్లో .. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు కూడా ఊపందుకున్నా యి. కొత్తగా అధికారంలోకి వచ్చిన.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తాము చేసిన సంక్షేమాన్ని చెప్పుకొనేం దుకు రెడీ అవుతోంది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రధానంగా ప్రస్తావిం చనుంది. ఇక, యువతను ఎక్కువగా ఆకర్షించేందుకు ఉద్యోగ నియామకాలను సబ్జెక్టుగా చేసుకోనుంది.
అయితే.. పాజిటివ్ దృక్కోణంలో చూస్తే.. బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు సబ్జెక్టులు కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీళ్లను చూపించారు ప్రాజెక్టులను చూపించారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఇంతింతై.. అన్నట్టుగా అప్పటి సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా.. ఏ వేదిక ఎక్కినా ప్రశంసించా రు.. స్వీయ వీరతాళ్లు వేసుకున్నారు. ఇక, మేడిగడ్డ వ్యవహారాన్ని మరింత హైలెట్ చేశారు. ఇంతగా ప్రాజెక్టుల గురించి చేసుకున్న ప్రచారం ఇప్పుడు.. ముగిసిన ముచ్చటగా మారనుంది.
కాళేశ్వరం సహా మేడిగడ్డ వ్యవహారంలో అవినీతి కంపు కొడుతోందని.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా తూర్పారబట్టింది. గత రెండు రోజుల కిందట.. పెద్ద ఎత్తున ఈ వ్యవహారం దుమారం రేపింది. ఇదిలావుం టే.. పోనీ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెరమీదికి తెద్దామన్నా.. దీనిపైనా కాగ్ దుమ్మురేపే నివేదికను ఇచ్చేసింది. సైకిల్‌పై కడప నుంచి హైదరాబాద్‌కు 216 గొర్రెలను రవాణా చేశారని, ఒకే కారులో 363 గొర్రెలు పంపించారని.. వీటికి బిల్లు పెట్టారని కాగ్ పేర్కొంది.
అంటే.. గొర్రెల పంపిణీ.. అవినీతి పంకిలంగా మారిపోయింది. ఇవన్నీ కాదు.. బతుకమ్మ చీరల గురించి చెప్పుకొందామన్నా.. కేసీఆర్‌కు ఇది కూడా మిగల్లేదు. సిరిసిల్ల నేత కార్మికులకు ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయి.. 4 వేల కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదని.. అసెంబ్లీ సాక్షిగా.. సీఎం రేవంత్ కొన్నాళ్ల కిందటే విమర్శలు గుప్పించారు. దీంతో ఎన్నికలకు ముందు సబ్జెక్టులు వెతుక్కునే పరిస్థితి కేసీఆర్‌కు వచ్చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.