మునుపటి పదునేదీ కారు సారూ ?

కేసీఆర్ పరోక్షంలో కేటీఆర్ హరీష్ రావు పార్టీని నడుపుతున్నా అసలైన సారధి కేసీఆర్ అన్న సంగతి పార్టీ జనాలకూ సాదర జనాలకూ తెలుసు అని అంటున్నారు.;

Update: 2026-01-27 19:30 GMT

ఎవరు కాదన్నా ప్రాంతీయ పార్టీలకు అధినేతలే సర్వంగా ఉంటారు. వారి ఇమేజ్ నే పార్టీకి శ్రీరామరక్షగా చూస్తారు. తెలంగాణాలో బీఆర్ఎస్ లాంగ్ ఇన్నింగ్స్ వెనక కేసీఆర్ అనే బిగ్గర్ ఇమేజ్ ఉన్న లీడర్ ఉన్నారన్నది లోక్ విధితం. తెలంగాణా ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా చేసినా అందులో గ్రాండ్ సక్సెస్ సాధించి ఒడుపుగా అధికారాన్ని అందుకున్నా అది కేసీఆర్ కే సాధ్యం. కేసీఆర్ కి ముందూ వెనకా ఎంతో మంది పార్టీలు పెట్టారు, అవి కాలగర్భంలో కలసిపోయాయి. కేసీఅర్ ని జనాలు నమ్మారు, ఆయన ప్రసంగాలలో వాడి వేడికి వారు ఎంతగానో మోజు పడి వెంటబడ్డారు. ఫలితంగానే గులాబీ పార్టీని ఘన విజయాలు దక్కాయి. కానీ 2023 లో బీఆర్ఎస్ ఓటమి చెందాక కేసీఆర్ తీరు మారిపోయింది. ఆయన జనం లోకి రావడం పూర్తిగా మానుకున్నారు. కేటీఆర్ కే బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కేరాఫ్ ఎర్రవెల్లి ఫాం హౌజ్ గానే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఉంది.

జనాంలోకి రాకుండానే :

గులాబీ పార్టీ 2026 ఏప్రిల్ 27 నాటికి పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26 వ ఏట అడుగు పెట్టింది. ఇది అత్యంత కీలకమైన సందర్భం. ఆవిర్భావ సభను అయితే నిర్వహించలేదు. ప్రజా ప్రతినిధుల సభతో ముగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రత్యర్థుల మీదనే బాణాలు అన్నట్లుగా ఉన్నాయి. సొంత పార్టీలో జోష్ తీసుకుని రావాల్సిన పెద్దాయన బాధ్యతలు అన్నీ కేటీఆర్ మీదనే పెట్టేశారు. రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలను రద్దు చేశారు. వాటికి కమిటీలను నియమించే బాధ్యతను అలాగే పార్టీ ప్రతినిధులకు శిక్షణా తరగతులను నిర్వహించే బాధ్యతను కూడా కేటీఆర్ కే అప్పగించారు. తాను మాత్రం జనంలోకి ఎపుడు వస్తానో చెప్పకుండానే ముగించారు.

క్యాడర్ లో జోష్ ఏదీ :

కేసీఆర్ పరోక్షంలో కేటీఆర్ హరీష్ రావు పార్టీని నడుపుతున్నా అసలైన సారధి కేసీఆర్ అన్న సంగతి పార్టీ జనాలకూ సాదర జనాలకూ తెలుసు అని అంటున్నారు. కేసీఆర్ నాయకత్వం వేరు, ఆయనలో ఉండే ఫైర్ వేరు, ఆ ఉత్సాహం వేరు. కేసీఆర్ జనంలోకి వచ్చి మాట్లాడితే ఆ కిక్కు వేరబ్బ్బా అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అపుడే సగం కాలం పూర్తి అయింది విపక్షానికి ఇది మంచి చాన్స్. కానీ కేసీఆర్ అయితే ప్రజలలోకి రావడం లేదు, జిల్లా పర్యటనలు చేయడం లేదు. ఆయన మరింత కాలం ఎర్రవెల్లి ఫాం హౌజ్ కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారని తాజా ప్రజా ప్రతినిధుల సభ అయితే తెలియచేస్తోంది.

అపుడు వస్తే ఎలా :

తెలంగాణా శాసనసభకు ఎన్నిక్లౌ 2028 చివరిలో ఉంటాయి. అంటే 2027 చివరిలో జనమలోకి వెళ్తే చాలు అన్నది గులాబీ బాస్ ఆలోచనా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే కనుక నిజం అయితే మాత్రం జనాలు కేవలం లాస్ట్ లో వచ్చిన అధినాయకుడిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారొ అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. రాజకీయాల్లో అధికార పాత్ర కంటే విపక్ష పాత్రనే ఎంతో కీలకం. అందువల్ల జనంలో నిత్యం ఉన్న వారికే జనాలు పట్టం కడతారు. ఆ విధంగా చూస్తే కేసీఆర్ సగం కాలం వదిలేశారు, ఇప్పటి నుంచైనా జనంలో ఉంటే కారు జోరు అందుకుంటుంది అని అంటున్నారు. అయితే గులాబీ పార్టీ అధినాయకత్వం తీరు చూస్తే కేటీఆర్ కే మొత్తం బాధ్యతలు అప్పగించినట్లుగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ అధిక బరువుని మోస్తూ గులాబీకి కొత్త గుభాళింపులను కేటీఆర్ ఏ విధంగా తీసుకుని వస్తారో.

Tags:    

Similar News