కేసీఆర్ జగన్ కూడబలుక్కుని మరీ !

రెండు తెలుగు రాష్ట్రాలు రెండు పార్టీల అధినేతలు ఇద్దరి రాజకీయ పంధా ఆలోచనలు ఇంచుమించుగా ఒక్కటిగానే ఉన్నట్లుగా అనిపిస్తాయి.;

Update: 2025-08-29 03:37 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు రెండు పార్టీల అధినేతలు ఇద్దరి రాజకీయ పంధా ఆలోచనలు ఇంచుమించుగా ఒక్కటిగానే ఉన్నట్లుగా అనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఇదే నిజం అయింది కూడా. దానిని చూసిన వారు ఈ ఇద్దరూ ఒకే తీరున ముందుకు సాగుతున్నారు అని అనుకోవడం కూడా జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ ఆరు నెలల తేడాలో రెండు రాష్ట్రాలలో తమ పార్టీలు ఓటమి పాలు కావడం తాము మాజీలు కావడం జరిగిపోయింది. ఇక ఓడిన తరువాత ఈ ఇద్దరూ రాజకీయంగా చేస్తున్న ఆలోచనలు వైఖరులు కూడా ఒక్కలాగే ఉంటున్నాయని చర్చ కూడా నడచింది.

ఇద్దరూ దూరంగానే :

ఇక కేసీఆర్ కానీ జగన్ కానీ అసెంబ్లీలకు పోకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణాలో అయితే కేసీఆర్ కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కింది. అయినా కూడా ఆయన వెళ్ళడం లేదు. కానీ తన పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు ఇక ఏపీలో చూస్తే జగన్ కి ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఆయన సభకు దూరంగా ఉండడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా దూరంగానే ఉంచారు. అలా దాదాపుగా పదిహేను నెలలు గడచిపోతున్నాయి.

జగన్ వస్తారని ప్రచారం :

ఇక తాజాగా చూస్తే సెప్టెంబర్ నెల మూడో వారం నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారని ఎపుడు అసెంబ్లీ పెట్టినా రావడానికి తయారుగా ఉన్నారని అంతే కాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను అసెంబ్లీలోనే ఎండగడతారు అని అంటున్నారు. ఆ విధంగా ప్రస్తుతానికి ప్రచారం అయితే ఉంది.

కేసీఆర్ సైతం :

మరో వైపు చూస్తే తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం సభలో కమిషన్ రిపోర్టుని పెట్టి చర్చిస్తుందని చెబుతున్నారు. ఈ చర్చలో కేసీఆర్ పాల్గొని ఆనాడు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా సమర్ధించుకోవడం కాకుండా అధికార కాంగ్రెస్ విధానాలను అన్ని రకాలుగా ఎండగడతారు అని అంటున్నారు. ఈసారి సభకు రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. అసెంబ్లీకి ఎన్నికలు జరిగి రెండేళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని వాటిని సభా ముఖంగానే కేసీఆర్ ప్రస్తావించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీ వేదికగానే ఢీ కొంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి అటు కేసీఅర్ ఇటు జగన్ కనుక అసెంబ్లీకి వస్తే కనుక ఈసారి సభా కార్యక్రమాలు ఒక స్థాయిలో ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News