ముద్దుల తనయపై మూడో కన్ను తెరచిన కేసీఆర్
కేసీఆర్ వ్యవహార శైలి గురించి బయట అందరూ తమకు తోచిన విధంగా చెప్పుకుంటారు. ఆయన ఉద్యమ నాయకుడు. ఆనాడు ఆయన తెలంగాణా కోసం ఉద్యమిస్తూంటే మధ్యాహ్న సూర్యుడిగా వెలిగిపోయేవారు.;
కేసీఆర్ వ్యవహార శైలి గురించి బయట అందరూ తమకు తోచిన విధంగా చెప్పుకుంటారు. ఆయన ఉద్యమ నాయకుడు. ఆనాడు ఆయన తెలంగాణా కోసం ఉద్యమిస్తూంటే మధ్యాహ్న సూర్యుడిగా వెలిగిపోయేవారు. ఆయనను టచ్ చేయడం కానీ దగ్గరకు వెళ్లడం కానీ ఎవరికీ సాధ్యపడేది కాదు. జాతీయ స్థాయిలో బడా పార్టీలను సైతం తమ చుట్టూ తిప్పించుకుని తెలంగాణా మొత్తం రాజకీయాన్ని షేక్ చేసి పారేసిన వారు కేసీఆర్ అంటారు.
చంద్రబాబుని మళ్ళీ సీఎం గా గద్దెనెక్కనివ్వను అని శపధం చేసి ఉమ్మడి ఏపీలో బాబు సీఎం కాకుండా చూసి మరీ తన పంతం నెరవేర్చుకున్నారు. అలాంటి కేసీఆర్ ప్రాణం పెడితే పెడతారు. అలా కాదు అనుకుంటే సొంత వారు అయినా బయట వారు అయినా ఆగ్రహమే చూపిస్తారు ఆయన ఆగ్రహానికి అనుగ్రహానికీ కూడా అనేక కారణాలు ఉంటాయని చెబుతారు.
అటువంటి కేసీఆర్ తన ముద్దుల తనయ మీదనే మూడవ కన్ను తెరవబోతున్నారా అన్న చర్చ సాగుతోంది. తండ్రి కేసీఆర్ కి కుమార్తె కవిత రాసిన లేఖ గత రెండు రోజులుగా గులాబీ పార్టీని అతలాకుతలం చేస్తోంది. అది చాలదు అన్నట్లుగా శం షా బాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన కామెంట్స్ కూడా కేసీఅర్ ని విపరీతమైన కోపం తెప్పించాయని అంటున్నారు. కేసీఆర్ చుట్టూ కోటరీ ఉందని దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన విమర్శలు పెద్దాయనకు ఆగ్రహం తెప్పించాయని చెబుతున్నారు.
అంతే కాదు బీఆర్ ఎస్ తీరు మారాలని ఆమె అనడం కూడా మండించే మాటగానే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ సొంత కూతురు అని చూడకుండా ఆమెను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ సీరియస్ యాక్షన్ కి దిగబోతున్నారు అన్నది ఇపుడు సాగుతున్న ప్రచారంగా ఉంది. బీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారని కవిత చేసిన ఆరోపణల మీద పెద్దాయన తీవ్రంగా మండిపడుతున్నారని కూడా అంటున్నారు.
కవిత మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారని అంటున్నారు. పార్టీ మీద కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్న ఆమె దూకుడుకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే గులాబీ పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆలోచిస్తున్నారుట. దాంతో కవిత వైఖరి మీద కచ్చితమైన చర్యలకు పార్టీ దిగుతోంది అని అంటున్నారు. కవిత మీద సీరియస్ యాక్షన్ కి కేసీఅర్ దిగబోతున్నారు అని అంటున్నారు. సో కవిత మీద ఏ రకమైన యాక్షన్ ఉంటుంది ఏ తీరులో ఉంటుంది అన్నది ఇపుడు బీఆర్ ఎస్ లోనూ రాజకీయ వర్గాలలోనూ హాట్ హాట్ గా జరుగుతున్న చర్చగా ఉంది.