బీజేపీలో ఉత్సాహం కోసమే కవిత అరెస్ట్ !

‘’ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను అరెస్టు చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరుత్సాపడింది.

Update: 2024-04-23 04:13 GMT

‘’ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను అరెస్టు చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిరుత్సాపడింది. అందుకే వారి కేడర్, కార్యకర్తలకు నమ్మకం కలిగించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేశారని, అందుకే ఇప్పుడు బీజేపీ కేడర్‌లో ఉత్సాహం వచ్చిందని’’ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఛానల్ క్వచ్చన్ అవర్ కార్యక్రమానికి హాజరైన అయన ‘’కవితకు ఈడీ నోటీసుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం ఉందని తాను గతంలో చెప్పానని... ఇప్పుడు అరెస్ట్ వెనుక కూడా ఓ కారణం ఉందని’’ ఆయన అన్నారు.

‘బీజేపీ వాళ్లు తమ రాజకీయ మనుగడ కోసం, బతుకుదెరువు కోసం రాముడి పేరును ఉపయోగించుకుంటున్నారని, శ్రీరాముడు దేవుడు అని, ఆయనను లీడర్ చేయవద్దని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని కోరడం విశేషం. ఈ ఎన్నికల్లో 12 నుండి 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని అన్నారు.

Tags:    

Similar News