కవిత : టార్గెట్ హరీష్ రావు !
అయితే ప్రధానంగా కల్వకుంట్ల కవిత హరీష్ రావు ను టార్గెట్ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ రావులదేనని, వారే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపిస్తుంది.
‘హరీష్ రావుకు దమ్ముంటే తన భార్యను నా మీద పోటీకి దింపాలి. హరీష్ రావు నేరుగా బరిలోకి రాకుండా తెరవెనక రాజకీయాలు చేస్తున్నారు. అవసరం అయితే ఆయన రాజకీయాలు వదిలేసి భార్యను బరిలోకి దింపవచ్చని, ఆమె తన మీద పోటీకి దింపినా స్వాగతిస్తానని’ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరింది. వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుండి శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించింది.
బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత ప్రధానంగా హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ల మీద ఆరోపణలు చేస్తోంది. ఇటీవల తాజాగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేసింది. తాను భవిష్యత్తులో హరీష్ రావు ను క్షమించినా, జీవితకాలంలో ప్రశాంత్ రెడ్డిని క్షమించనని అన్నారు.
అయితే ప్రధానంగా కల్వకుంట్ల కవిత హరీష్ రావు ను టార్గెట్ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ రావులదేనని, వారే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటించారని కవిత ఆరోపిస్తుంది.
హరీష్ రావు బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, తనను పార్టీ నుండి బయటకు పంపిచడంలో, తన కుటుంబంలో విభేదాలు సృష్టించడంలో ప్రధాన కుట్ర దారు హరీష్ రావు అని, కేసీఆర్, కేటీఆర్ లు వీరి విషయంలో జాగ్రత్త ఉండాలని కవిత గతంలో అన్నారు.
అయితే కవిత ఆరోపణల విషయంలో హరీష్ రావు స్పందించడం లేదు. ప్రధానంగా హరీష్ రావు మీద విమర్శలు, ఆరోపణల నేపథ్యంలోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.
గతంలో సిద్దిపేట నుండి హరీష్ రావు మీద పోటీ చేస్తానని ప్రకటించిన కవిత, హరీష్ రావు సతీమణిని పోటీకి దింపినా సిద్దమేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఎలా స్పందిస్తారు ? లేక గతంలో మాదిరిగానే మౌనం వహిస్తారా ? అన్నది వేచిచూడాలి.