పారిస్ లో ప్రియురాలితో మాజీ ప్రధాని.. వీడియో వైరల్!
అవును... కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో.. అమెరికన్ పాప్ స్టార్ కేటీ పెర్రీతో డేటింగ్ లో ఉన్నారంటూ ఇటీవల వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.;
దాదాపు దశాబ్దం పాటు కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇతని హయాంలో భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన బంధం దెబ్బతిందనే చర్చ బలంగా జరిగింది. ఇక ఆయన వ్యక్తిగత విషయానికొస్తే... 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన ఆయన.. భార్య సోఫీ గ్రెగొరీతో 2023 ఆగస్టులో విడిపోయారు.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 13 సార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన పాప్ స్టార్ కేటీ పెర్రీ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. నటుడు ఓర్లాండో బూమ్ తో ఏడేళ్లుగా కలిసి ఉన్న ఆమె.. ఈ ఏడాది జూన్ లో అతడితో విడిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తెరపైకి వచ్చిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
అవును... కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో.. అమెరికన్ పాప్ స్టార్ కేటీ పెర్రీతో డేటింగ్ లో ఉన్నారంటూ ఇటీవల వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో... తాజాగా వారిద్దరూ కలిసి ఓ పార్టీలో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇందులో భాగంగా... పారిస్ లోని ఓ థియేటర్ నుంచి శనివారం రాత్రి ట్రూడో, కేటీ పెర్రీ చేతిలో చేయి వేసుకొని బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడ జరిగిన ఓ మ్యూజికల్ షోకు వీరు హాజరైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కేటీ పెర్రీ 45వ పుట్టినరోజు సందర్భంగా వీరు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో ఇద్దరు ఫుల్ జోష్ లో కనిపించారు.
వీరిద్దరి బంధం మధ్య సోషల్ మీడియాలోనూ, అటు మీడియాలోనూ విపరీతంగా ప్రచారం జరుగుతున్న వేళ.. ఈ ఏడాది జులైలో ట్రూడో, పెర్రీ జంట మాంట్రియల్ లోని ఓ రెస్టారెంట్ లో తొలిసారి కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం విపరీతంగా మొదలైంది. అయితే.. ట్రూడో - కేటీలు దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు.
అయితే... కొద్ది రోజుల క్రితం ఓ ఖరీదైన నౌకపై వీరు అత్యంత సన్నిహితంగా విహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జరుగుతున్న ప్రచారానికి, ఊహాగాణాలకు బలం చేకూరింది. ఇక తాజా వీడియోతో ఆ ప్రచారం, ఊహాగాణాలు వాస్తవమని నెటిజన్లు ఓ నిర్ధారణకు వచ్చేశారని అంటున్నారు.