• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆమెకు 10 మంది పిల్లలు.....

ఆమెకు 10 మంది పిల్లలు.. ఇంకొకరు కావాలట

| అవును.. ఆమెకు పది మంది పిల్లలు. పిల్లలు కావాలనుకోవటం ప్రతి స్త్రీ ఆశ పడుతుంది

By - Tupaki Desk
Update: 2024-02-11 09:30 GMT

అవును.. ఆమెకు పది మంది పిల్లలు. పిల్లలు కావాలనుకోవటం ప్రతి స్త్రీ ఆశ పడుతుంది. అయితే.. మారిన కాలానికి తగ్గట్లు ఇప్పుడు కొందరు పిల్లలు అంటేనే వామ్మో అనేస్తారు. అయితే.. వీరందరికి భిన్నమైన మహిళ నలభై ఏళ్ల బ్యారిసా కాలిన్స్. అమెరికాకు చెందిన ఆమెకు ఇప్పటికి పది మంది పిల్లలు. గడిచిన పదేళ్లుగా ఆమె పిల్లల్ని పుట్టించటమనే ఉద్యమాన్ని నాన్ స్టాప్ గా చేయటమే కాదు.. మరో సంతానం కోసం తెగ ఆత్రపడిపోతోంది.

ఈ అమెరికన్ తల్లికి టిక్ టాక్ లో 30 మిలియన్ల (3కోట్లు మంది)కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పిల్లల్ని కనటం.. వారి అలానాపాలనా చూసుకోవటం.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేసి సక్సెస్ కావటం ఆమెకు అలవాటు. తరచూ తన లైఫ్ కు సంబంధించిన వీడియోల్ని ఆమె షేర్ చేస్తుంటారు. ఆమె షేర్ చేసే వీడియోలకు లక్షల వ్యూస్ వస్తుంటాయి. కొన్ని వీడియోలకు అయితే ఏకంగా 30 లక్షల వ్యూస్ రావటం చూస్తే ఆమె ఎంత ఫేమస్ అన్న విషయం అర్థమవుతుంది.

తన భర్త ఉద్యోగ రీత్యా ఎక్కువగా బయటే ఉంటారని ఆమె చెబుతుంది. అందుకే పిల్లల అలనాపాలనా అంతా తానై చూసుకుంటూ ఉంటుంది. ఆమె తన పిల్లలకు పెట్టే పేర్లు కాస్తంత భిన్నంగా ఉంటాయి. మొత్తం పది మందిలో ముగ్గురు మగ సంతానమైతే.. మిగిలిన ఏడుగురు ఆడ సంతానం. వీరి ఫ్యామిలీని చాలామంది ‘లాఫింగ్ ఫ్యామిలీ’గా అభివర్ణిస్తారు. తన భర్త అద్భుతమైన తండ్రిగా ఆమె పొగిడేస్తుంటారు. తన భర్త ఇంటికి వచ్చినప్పుడుపిల్లలతో చాలా బాగా ఆడుకుంటాడని చెప్పే ఆమెకు మరో సంతానం కావాలన్న ఆశను చెబుతుంటారు.

పిల్లల మీద ఆమెకున్న మక్కువను కొందరు పొడిగేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఆమె మీద బ్యాన్ విధించాలని కోరే వారు లేకపోలేదు. ఆమెకు చెందిన కొన్ని టిక్ టాక్ వీడియోలకు 55 లక్షల వ్యూస్ కూడా ఉండటం విశేషం. మొత్తంగా ఆమె గురించి తెలిసిన మహిళలు మాత్రం ఆమె ఓపికకు.. సహనానికి మాత్రం అచ్చెరువు చెందకుండా ఉండని పరిస్థితి. ఆమె కోరుకున్నట్లుగా మరో సంతాన భాగ్యం త్వరలోనే కలగాలని ఆశిద్దాం.

పిల్లల పేర్ల విషయానికి వస్తే..

అనిసా (14)

ఆండ్రీ (13)

అనిస్టన్ (11)

ఏంజెలీ (10)

అండర్సన్ (9)

ఏంజెల్ (7)

ఎన్సర్ (6)

యాంకర్ (4)

యాంథిమ్ (3)

బేబీ ఆర్మర్ (1)

Tags:    
  • Karissacollins 
  • Children 
  • Americawoman 
  • Karissacollinschildren 
  • Tiktok 
  • Karissacollinspregnant 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS