కేసీఆర్...జైలూ...రేవంత్ కామెంట్స్ వైరల్ !
తెలంగాణాను సాధించిన నేతగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి తెలంగాణాలో ఇపుడు అధికారం పోయింది.;
తెలంగాణాలో రాజకీయం పీక్స్ కి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను ప్రభుత్వానికి అప్పగించడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కింది ఈ నివేదికలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి అనవసర వ్యయం చేశారు అన్నది కూడా నివేదిక చెబుతోంది. దాంతో ఈ ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో పెట్టి అందరి అభిప్రాయం తీసుకుని ఆ మీదట చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా ఈ కేసులో ఏమవుతుంది అన్న చర్చ అయితే అందరిలో ఉంది.
కేసీఆర్ కేరాఫ్ ఫాం హౌస్ :
తెలంగాణా జాతిపితగా తన పార్టీ క్యాడర్ చేత అభిమానుల చేత గొప్పగా పిలిపించుకునే కేసీఆర్ గత రెండేళ్ళుగా ఎర్రవెల్లి ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. ఆయన బయటకు పెద్దగా రావడం లేదు. ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఆయనను చూసేందుకు కూడా అభిమానులకు క్యాడర్ కి కూడా అంతగా అవకాశం అయితే దక్కడం లేదు ఒక విధంగా చూస్తే కేసీఆర్ కొందరు పార్టీ ముఖ్యులతో తప్ప ఎవరినీ కలవడం లేదు అని అంటున్నారు. దాంతో అదే ఆయనకు స్వీయ నిర్భంధంగా మారిందా అన్నది కూడా ప్రత్యర్ధుల విమర్శగా ఉంది.
అంతకంటే పెద్ద శిక్ష :
తెలంగాణాను సాధించిన నేతగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి తెలంగాణాలో ఇపుడు అధికారం పోయింది. దాంతో ఆయన జనాలకు దూరంగా ఫాం హౌస్ లో ఉంటున్నారు. ఒక విధంగా ఆయనకు ఆయనే స్వేయం నిర్బంధంలో ఉంటున్నారు అది చాలాదా అంటున్నారు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు అంతకంటే పెద్ద శిక్ష వేరేగా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఉన్న ఎర్రవెల్లి ఫాం హౌస్ కి చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముంది అంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడ అయినా ఒక్కటేగా అని అంటున్నారు.
కక్ష సాధింపు లేదా :
తనకు కేసీఆర్ మీద రాజకీయ కక్ష ఏమీ లేదని ఆయన విషయంలో కక్ష సాధింపు చర్యలు తీసుకోమని కూడా చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నివేదిక మీద అసెంబ్లీలో చర్చింది ఆ మీదట ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు బట్టి చూస్తే కేసీఆర్ కి జైలు అరెస్టు ఇలాంటివి అన్నీ ఏమీ ఉండవనే అంటున్నారు ఆయన విషయంలో తనకు కన్సర్న్ ఉందని అందుకే ఆయన అనారోగ్యం పాలు అయినపుడు కూడా వెళ్ళి పరామర్శించాను అని చెబుతున్నారు.
అంతా వ్యూహాత్మకమేనా :
జైలుకు కేసీఆర్ ని పంపుతారు అన్న వార్తలు ఒట్టివి అన్నది రేవంత్ రెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ ని నిజంగా ఈ వయసులో జైలుకు పంపిస్తే అది కచ్చితంగా కాంగ్రెస్ కే బూమరాంగ్ డెసిషన్ అవుతుంది అని అంటున్నారు. పైగా కేసీఆర్ కి ఒక్కసారిగా సానుభూతిని అందించిన వారు అవుతారని అంటున్నారు. జైలుకు వెళ్ళిన వారు అంతా విజేతలుగానే ఉన్నారని రాజకీయ వర్తమానం నిరూపిస్తోంది. అందుకే కేసీఅర్ విషయంలో కాంగ్రెస్ తొందరపడదనే అంటున్నారు. మొత్తానికి ఎర్రవెల్లి ఫాం హౌస్ చర్లపల్లి జైలు రెండూ ఒక్కటే అని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి