జూబ్లీ హిల్స్ పోరు... కాంగ్రెస్ గెలుపు ష్యూర్ ?
జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. అంటే గట్టిగా రెండు నెలల వ్యవధి లేదని అంటున్నారు.;
జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. అంటే గట్టిగా రెండు నెలల వ్యవధి లేదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ తమ క్యాండిడేట్ ఎవరూ అన్న దాని పైన సెలెక్షన్ కంప్లీట్ చేసింది అని అంటున్నారు. ఈ సీటులో 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థికే అంతా ఓటేస్తున్నారు. మాస్ లో నుంచి వచ్చిన లీడర్ ని పెడితే గెలుపు డ్యాం ష్యూర్ అని లెక్క పక్కాగా వేస్తున్నారు అంటున్నారు.
సీఎం రేవంత్ మదిలో :
ఇక చూస్తే కనుక నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ని దాదాపుగా స్టేట్ లెవెల్ లో ఫిక్స్ చేసినట్లే అని అంటున్నారు. హై కమాండ్ కి ఒక్క మారు చెప్పి ఫైనలైజ్ చేసుకోవడమే తరువాయి అని అంటున్నారు. ఇంతకీ ఎవరా నవీన్ యాదవ్ అంటే హైదరాబాద్ జనాలందరికీ ప్రముఖంగా వినిపించే పేరు చిన్న శ్రీశైలం యాదవ్. ఆయన కుమారుడే ఈ నవీన్ యాదవ్ అని చెబుతున్నారు. ఈ ఫ్యామిలీకి జూబ్లీ హిల్స్ లో మొత్తం అన్ని వర్గాలలో పట్టు ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఇక్కడ గణనీయంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి దాంతో వారి వద్ద కూడా మంచి పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు అంగబలం అర్థ బలం నిండుగా ఉన్న ఫ్యామిలీ అని చెబుతున్నారు.
గెలుపు అంచులను చూసిన నేపథ్యం :
ఇక నవీన్ యాదవ్ గురించి చెప్పాలంటే 2014లో ఇదే జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అది కూడా మజ్లిస్ పార్టీ నుంచి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దివంగత మాగంటి గోపీనాధ్ చేతిలో ఓటమి పాలు అయినా తొమ్మిది వేల ఓట్లతోనే అని చెబుతున్నారు. ఇక 2018లో అయితే బీఆర్ఎస్ తో మజ్లీస్ కి ఉన్న స్నేహం వల్ల నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో చేరారు కానీ టికెట్ అయితే దక్కలేదు. ఇక 2023లో కచ్చితంగా టికెట్ తనదే అనుకుంటే అజారుద్దీన్ కి ఇచ్చారు. అయినా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఇంచార్జి గా ఉండి ఆయన గెలుపు కోసం కృషి చేశారు.
అనూహ్యగా చాన్స్ :
ఇపుడు చూస్తే అనూహ్యంగా ఆయనకు చాన్స్ దక్కేలా ఉంది. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన మీదనే దృష్టి పెట్టారు. మాస్ లీడర్ కి సీటు ఇస్తే గెలుపు ఖాయమని ఆయన భావిస్తున్నారు. దాంతో ఆయనతో పాటు పీసీసీ కూడా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతోంది. ఇక కాంగ్రెస్ హై కమాండ్ ఓకే చెబితే ఆయనే అభ్యర్థి అని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల నేపధ్యంలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందా అన్న చర్చ కూడా ఉందిట. ఒకవేళ ఇచ్చిన గెలుపు అన్నది కాంగ్రెస్ దే అని అంటున్నారు. సో ఈ టికెట్ నవీన్ యాదవ్ కి దక్కితే ఆయన పరపతి కాంగ్రెస్ బలం, అధికారం బీఆర్ఎస్ ఇబ్బందులు అన్నీ కలసి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కలను తీర్చేస్తాయని అంటున్నారు. మరి అజారుద్దీన్ ఆశలు సంగతేంటి అంటే నెక్స్ట్ టైం బెటర్ లక్ అనే అంటున్నారుట.