జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కీలక అప్డేట్: మీ ఓటుందా?
హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం రెడీ అవుతోంది. బీఆర్ఎస్ నాయకుడు మాగుంట గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.;
హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం రెడీ అవుతోంది. బీఆర్ ఎస్ నాయకుడు మాగుంట గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారు? రాజకీయ పోరు ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగాదీనిపై కీలక అప్డేట్ ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి? ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకపోతే..ఏంచేయాలి? కొత్తగా నమోదైన ఓటర్లకు అవకాశం.. ఇలా అనేక విషయాలతో తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
ఇవీ.. వివరాలు..
+ నియోజకవర్గంలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. వీరిలోనూ పురుషులే ఎక్కువగా 2 లక్షల 12 వేల, 600 మంది ఉన్నారు.
+ మహిళా ఓటర్లు.. 1,88,109 మంది ఉన్నారు.
+ మొత్తంగా జూబ్లీహిల్స్‌లో 47 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి.
+ ఓటు హక్కు లేని వారు.. ఈ నెల 17వతేదీ వరకు నమోదు చేసుకోవచ్చు.
+ అడ్రస్ మారినా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఫిర్యాదు చేయొచ్చు.
+ 18 ఏళ్లు నిండిన వారు.. తక్షణమే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.
+ పొరుగు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు కూడా.. ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
50-60 రోజుల్లోనే..
ఇక, తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలు.. కొత్త ఓటర్ల నమోదుకు ఇచ్చిన గడువును పరిశీలిస్తే.. ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైందనే అధికారులు చెబుతున్నారు. మరో 50-60 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా కొత్త ఓటర్ల నమోదు.. ఉన్నవారి పేర్లు, ఊర్లు మార్పు వంటివి ప్రతి ఎన్నికలకు 50 రోజుల ముందు చేపడతారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప పోరుకు సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన సర్క్యులర్‌ను బట్టి.. మరో 50-60 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతో రాజకీయ సందడి ఓ రేంజ్‌లో మొదలు కానుంది