వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన బీజేపీ

ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారు అని జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు.;

Update: 2025-09-14 14:30 GMT

వైసీపీ ఎపుడూ బీజేపీకి ప్రత్యర్ధి పక్షమే అని ఆ పార్టీ నిరూపిస్తోంది. వైసీపీని రాజకీయంగా దూరంగానే పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కూడా గుంటూరులో జరిగిన సభలో మోడీ వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అవినీతి ప్రభుత్వం అని నాడు బీజేపీ పెద్దలు అన్నారు. అదే నిజమని నేడు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నారు. ఆయన విశాఖలో జరిగిన బీజేపీ సభలో వైసీపీ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

అవినీతి సర్కార్ ని సాగనంపారు :

ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారు అని జేపీ నడ్డా హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీని అవినీతి ప్రభుత్వం అని ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని కూడా ఆయన నిందించారు. 2024 వరకూ నడచిన ఆ ప్రభుత్వాన్ని కూలదోసినందుకు ప్రజలను అభినందిస్తున్నామని ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతే కాదు వైసీపీది అసమర్థ అస్తవ్యస్తమైన ప్రభుత్వం అని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఒక డెత్ ట్రాప్ :

వైసీపీని ఒక డెత్ ట్రాప్ గా ఆయన అభివర్ణించారు. మరి దీనిని అర్ధం పరమార్ధం ఏమిటో తెలియదు కానీ షాకింగ్ కామెంట్స్ గానే అంతా చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన అయిదేళ్ల పాటు సాగించింది అని కూడా నడ్డా వ్యాఖ్యానించారు. తమ అవినీతి పాలనతో అరాచక విధానాలతో ఏపీని పూర్తిగా అంధకారంలోకి వైసీపీ నెట్టిందని కూడా దుయ్యబట్టారు.

కూటమి పాలనతో పూర్వ వైభవం :

ఇక ఏపీలో గత పదిహేను నెలలుగా సాగుతున్న కూటమి పాలనతో రాష్ట్రానికి పూర్వ వైభవం దక్కుతోంది అని జేపీ నడ్డా అన్నారు. ఏపీ ప్రజల గుండెలలో మోడీ ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు ఏపీకి ఎంతో మేలు చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోంది అని ఆయన గుర్తు చేశారు. వైసీపీ చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏపీకి చేసిన సాయాలని ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్ళాలని బీజేపీ క్యాడర్ ని ఆయన కోరారు.

నిన్ననే ఓటేసి మరీ :

ఇదిలా ఉంటే జేపీ నడ్డా ఏపీకి వచ్చి విశాఖలో సభలో వైసీపీ మీద చేసిన సంచలన వ్యాఖ్యలను ఆ పార్టీ తట్టుకోలేని లాగానే ఉన్నాయి. నిన్నటికి నిన్ననే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఫక్తు బీజేపీ అభ్యర్థికి వైసీపీ ఓటేసి తాము అండగా ఉన్నామని చెప్పింది. అయితే అది వైసీపీ బలహీనత అనివార్యతగా బీజేపీ భావిస్తోంది అన్నది అర్ధం అవుతోంది అంటున్నారు. దీని కంటే ముంది వైసీపీని తీవ్ర విమర్శలు చేసే బీజేపీ ఏపీలో కూటమితో కలసి అధికారంలోకి వచ్చింది.

ఉమ్మడి శతృవుగానే :

అన్ని తెలిసి కూటమితోనే రాజకీయ పోరు అన్నది కూడా గుర్తెరిగినా వైసీపీ ఎందుకు బీజేపీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చింది అన్నదే ఆ పార్టీ వారికి అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తానికి ఏపీలో చూస్తే కూటమి ఉమ్మడి శతృవుగానే వైసీపీని బీజేపీ చూస్తోంది. అంతే కాదు షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. దీంతో వైసీపీ రాజకీయ వ్యూహాలు ఎంత పేలవంగా ఉన్నాయో బీజేపీ నుంచి వస్తున్న విమర్శలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. దీంతో బీజేపీ వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని అంటున్నారు.

Tags:    

Similar News