టేకాఫ్ సమయంలో విమాన చక్రం ఊడింది... వీడియో వైరల్!

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎదురవుతున్న టెన్షన్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-04-24 15:30 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎదురవుతున్న టెన్షన్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. విమానం గాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డోర్లు ఊడిపోతుండటం.. టేకాఫ్ సమయానికి కేవలం 2 నిమిషాలకు సరిపడా ఇందనం మాత్రమే ఉండటం.. ఇలాంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. ఈ సమయంలో మరో టెన్షన్ విషయం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

అవును... ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఇటీవల కాస్త రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక సమస్యతో ఇటీవల బోయింగ్ విమానాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మరో ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తాజాగా బోయింగ్ 737 విమానం టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయింది.

దీంతో... ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారడం.. వివాదానికి దారి తీయడం చక చకా జరిగిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌ బర్గ్ లోని ఓఆర్ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీటికింద నెటిజన్ల కమెంట్లు మరింత వైరల్ గా మారుతున్నాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో... ఎయిర్ పోర్ట్ లో విమానం టేకాఫ్ సమయంలో చక్రం నుంచి పొగలు రావడం కనిపించింది. దీంతో వెంటనే ఫ్లైట్ ఎమర్జెన్సీ గా స్టాప్ చేశారు. ఈ వీడియోలో... సదరు విమానం అండర్ క్యారేజ్, కుడి వింగ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. అయితే... ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు నివేదించబడలేదని ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది.

Read more!
Tags:    

Similar News