పవన్ దెబ్బకు జోగయ్య కొత్త అవతారం ...!

అంతే కాదు తాను ఇక మీదట రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు.

Update: 2024-03-09 00:30 GMT

రాజకీయాల్లో బాగా ముదిరిన వారు ఏమవుతారో అదే బాటను మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఎంచుకున్నారు. రాజకీయ భీష్ముడు పెద్దాయనకు బాగా కోపం వచ్చింది. తన రాజకీయ అనుభవం అంత వయసు ఉన్న పవన్ కళ్యాణ్ కి సలహాలు సూచనలు ఇచ్చి కాపుల కోసం పనిచేయాలనుకున్న జోగయ్యకు పవన్ ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ హర్ట్ చేశాయని అంటున్నారు. తాడేపల్లిగూడెం సభలో పవన్ మాట్లాడుతూ మీ సలహాలు నాకు వద్దు అని చెప్పేశారు.

ఇక గురువారం మంగళగిరిలో పార్టీ నేతలతో ఆయన మరోసారి మాట్లాడుతూ నాకు మాత్రమే సలహాలు చెబుతారు కానీ వీరంతా వైసీపీలోకి వెళ్తారు అని సెటైర్లు వేశారు. రాజకీయాలు నాకు తెలియదా మీరు చెప్పాలా అని మండిపడ్డారు. ఇలా మాటిమాటికీ పవన్ కాపు పెద్దల మీద విసుర్లు విసరడంతో జోగయ్య ఫీల్ అవుతున్నారుట.

దాంతో ఆయన ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారు. కాపు సంక్షేమ సేన అని ఆయన చాలా కాలంగా నడుపుతున్నారు. కాపుల కోసమే దాన్ని ఆయన స్టార్ట్ చేసారు. కాపు సంక్షేమ సేనను ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలలో గ్రామ స్థాయి దాకా తీసుకుని వెళ్ళి కమిటీలు సైతం వేశారు. ఇలా ఏపీలోని కాపులకు రాజకీయంగా అండగా ఉండాలని జనసేన ద్వారా వారి కోరికలు తీర్చాలని దానికి వారధి కావాలని జోగయ్య భావించారు.

కానీ వర్తమాన రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన మీదట ఆయన కలత చెందారు. ఇక కాపు సేన ఉండదు అని చెప్పేసి రద్దు చేసారు. అంతే కాదు తాను ఇక మీదట రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు. ఇక మీదట రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోనని ఆయన చెప్పేశారు. తాను రాజకీయ విశ్లేషకుడిగా ఉంటాను అని ప్రకటించారు.

Read more!

అంటే జోగయ్య కొత్త అవతారం అన్న మాట. రాజకీయ విశ్లేషకుడు అంటే అన్ని పార్టీలని నిశితంగా విమర్శించవచ్చు. అంతే కాదు ఆయా పార్టీల జాతకాలను కూడా బయటపెట్టవచ్చు. మొత్తం స్వేచ్చతో మాట్లాడవచ్చు. అందుకే జోగయ్య ఈ కొత్త అవతారంలోకి మారనున్నారు. ఇప్పటికే రాజకీయాలకు స్వస్తి పలికిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ విశ్లేషకుడి అవతారంలో ఉన్నారు. ఇపుడు జోగయ్య తనది అదే పని అంటున్నారు.

జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు. జోగయ్య కూడా వైసీపీ కో వర్ట్ అని జనసేన నుంచి విమర్శలు వస్తున్న నేపధ్యంలో తాను రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నట్లుగా ఆయన అంటున్నారు. మొత్తానికి పవన్ తో ప్రయాణం చేసిన జోగయ్య ఇపుడు రాజకీయాలకు వద్దు అని దండం పెడుతున్నారు.

Tags:    

Similar News