వైసీపీలోకి జేసీ వారసుడు ?

అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆ కుటుంబం దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలసి ప్రయాణించింది.;

Update: 2025-11-03 22:30 GMT

ఈ వార్త అయితే ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. రాజకీయ వర్గాలలో అయితే చర్చగానూ ఉంది. ఇంతకీ ఈ ప్రచారం ఏమిటి ఎవరా వారసుడు ఏమా కధ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనే అంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆ కుటుంబం దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలసి ప్రయాణించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో ఏమీ కాకుండా పోవడంతో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. ఇక మాజీ మంత్రి దిగ్గజ నేత జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిస్తే తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సీన్ రివర్స్ :

ఇక 2019 నాటికి సీన్ మొత్తం రివర్స్ అయింది. జిల్లాలో కేవలం రెండు సీట్లు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ కైవశం చేసుకుంది. ఆ ఊపులో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వారసుడు అస్మిత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి పోటీ చేస్తే ఓటమిని చవి చూడడం జరిగింది. ఇక అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఓటమి పాలు అయ్యారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసారు. 2024లో అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి గెలిస్తే పవన్ రెడ్డి మాత్రం ఎందుకో ఎంపీగా పోటీ చేయలేదు.

ఆయన గురించే అంతా :

ఇక చూస్తే కనుక జేసీ దివాకర్ రెడ్డి దాదాపుగా రాజకీయ విరమణ ప్రకటించారు. ఆయన వయోభారంతో ఉన్నారు. తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మాత్రం జోరు మీద ఉన్నారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని తాను తాడిపత్రి చైర్మన్ గా ఉంటూ ఒక విధంగా టీడీపీలో రీ సౌండ్ చేస్తున్నారు. అయితే టీడీపీలో జేసీ ఫ్యామిలీ రాజకీయం కూడా అతి అవుతోంది అన్న చర్చ ఉండనే ఉంది. ఆ విషయం పక్కన పెడితే పవన్ రెడ్డి గురించే ఇపుడు అంతటా చర్చ సాగుతోంది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు కి ఒక రాజకీయ వేదిక దొరికింది. మరి పవన్ రెడ్డి ఏ వైపు నుంచి అన్నది చర్చగా సాగుతోంది.

వైసీపీలోకి అంటూ :

వైసీపీలోకి పవన్ రెడ్డి వస్తున్నారు అని ఒక టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆయన యువ నేతగా ఉన్నారు. పైగా ఫ్యూచర్ పాలిటిక్స్ ని అంచనా వేసుకుంటూ తన రూట్ ని క్లియర్ గా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే జేసీ ఫ్యామిలీ తరువాత తరంలో పవన్ రెడ్డి వైసీపీ వైపు అడుగులు వేస్తే మిగిలిన కుటుంబం సంగతి ఏమిటి అన్న చర్చ కూడా ఉంది.

వైసీపీ ఓకేనా :

వైసీపీకి ఈ జిల్లాలో నాయకులకు అయితే కొరత లేదు, అలాగని రాజకీయంగా దిగ్గజ కుటుంబం నుంచి ఒక వారసుడు యువనేత వచ్చి చేరుతారు అంటే నో అని చెప్పేది కూడా ఉండదని అంటున్నారు. పైగా ఇది టీడీపీకి బిగ్ షాట్ గా ఉంటుందని భావించినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. అయితే పవన్ రెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకుంటే బాబాయ్ ప్రభాకర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే టీడీపీ సంగతేంటి, అంతకు మించి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా ఈ పొలిటికల్ గాసిప్ లాంటి వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. మరి నిప్పు ఉంటేనే కానీ పొగ రాదు అనుకోవాలా లేక ఏమీ కాకుండానే పొగ పుట్టిందా అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News