• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అలర్ట్... తదుపరి మహమ్మారి...

అలర్ట్... తదుపరి మహమ్మారి ముప్పు అక్కడి నుండేనా..?

| కరోనా మహమ్మారి 2019 డిసెంబర్ లో చైనాలోని వూహన్ లో మొదలై 2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సంగతి తెలిసిందే.

By - Raja Ch
Update: 2025-10-11 16:34 GMT

కరోనా మహమ్మారి 2019 డిసెంబర్ లో చైనాలోని వూహన్ లో మొదలై 2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దాని ప్రభావం నుంచి చాలా కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదని అంటారు. ఈ సమయంలో.. తదుపరి మహమ్మారి ముప్పుపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి!

అవును... కరోనా వైరస్ మహమ్మారి తర్వాత.. తదుపరి మహమ్మారి ముప్పుపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి! ఇందులో భాగంగా... జపాన్‌ లో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా తీవ్రంగా, అసాధారణంగా ముందుగానే వ్యాప్తి చెందుతోందని.. దీనితో ఆ దేశం పెద్ద ప్రజారోగ్య సంక్షోభం అంచున ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ప్రస్తుతం సుమారు 3,000 ఆసుపత్రులలో 4,030 కి పైగా ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో... ఇది దేశాన్ని దాని అంటువ్యాధి పరిమితికి మించి నెట్టివేసిందని అంటున్నారు. వాస్తవానికి దేశంలో సాధారణంగా డిసెంబర్‌ లో ఫ్లూ కేసులు పెరుగుతాయి కానీ.. ఈ ఏడాది పెరుగుదల ఒక నెల ముందుగానే ప్రారంభమైందని చెబుతున్నారు.

ప్రధానంగా పిల్లలలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడంతో జపాన్ లో సుమారు 100కి పైగా పాఠశాలలు, కిండర్ గార్టెన్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ఇప్పటికే మూసివేయబడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... ప్రజలను మాస్కులు ధరించడం, రెగ్యులర్ గా చేతుల పరిశుభ్ర పరుచుకోవడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే... ప్రపంచవ్యాప్త ప్రయాణం, పెరిగిన హ్యూమన్ మొబిలిటీ కారణంగా వైరస్ వేగవంతమైన వ్యాప్తికి ఆజ్యం పోసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఈ సందర్భంగా స్పందించిన హక్కైడోలోని హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోకో సుకామోటో.. ఇతర దేశాలలో కూడా ప్రారంభ ఫ్లూ తరంగాలు నివేదించబడుతున్నాయని తెలిపారు.

కాగా మెషిన్ లెర్నింగ్, ఉపగ్రహ డేటాను ఉపయోగించి చేసిన జాయింట్ రీసెర్చ్ సెంటర్ (జే.ఆర్.సీ) మోడలింగ్ అధ్యయనం ప్రకారం... ప్రపంచ భూ ఉపరితలంలో 9.3% ఎబోలా, జికా, క్రిమియన్-కాంగో హెమరేజిక్ జ్వరం వంటి వ్యాధుల వ్యాప్తికి ఎక్కువ ప్రమాదం ఉందని వెల్లడించింది. అలాగే అంటువ్యాధులు, మహమ్మారిని కలిగించే సామర్థ్యం ఉన్న వ్యాధుల జాబితా పరిశీలనలో ఉందని తెలిపింది.

ఇందులో భాగంగా... కోవిడ్-19, మార్బర్గ్ వైరస్ వ్యాధి (ఎం.వీ.డీ), లస్సా జ్వరం, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎం.ఈ.ఆర్.ఎస్), అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఏ.ఆర్.ఎస్), నిపా వైరస్ వ్యాధి (ఎన్.ఐ.వీ), రిఫ్ట్ వ్యాలీ జ్వరం (ఆర్.వీ.ఎఫ్.) వంటివి ఉన్నాయి!

Tags:    
  • GlobalHealth 
  • FluOutbreak 
  • JapanFlu 
  • PandemicAlert 
  • COVID19Aftermath 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS