జై శంకర్ ప్రశ్నలకు అమెరికా సమాధానం చెబుతుందా?

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టే ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టారీఫ్ లు పెంచుతామంటూ భారత్ ని బెదిరింపులకు గురి చేస్తున్నా కూడా భారత్ దానికి దీటైన సమాధానం ఇస్తుంది.;

Update: 2025-08-23 10:24 GMT

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టే ఆంక్షల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టారీఫ్ లు పెంచుతామంటూ భారత్ ని బెదిరింపులకు గురి చేస్తున్నా కూడా భారత్ దానికి దీటైన సమాధానం ఇస్తుంది. ఇప్పటికే భారత్ అగ్ర దేశాలు అయినటువంటి చైనా, రష్యాలతో స్నేహం కుదుర్చుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ రష్యాలో కూడా పర్యటించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ని కలిసి పలు రాజకీయ, వ్యాపార విషయాల గురించి చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జై శంకర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రష్యా నుండి చమురు కొనద్దంటున్నందుకు భారత్ పై 50% టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జై శంకర్ రష్యా గడ్డపై నుండి అమెరికాకు దిమ్మ దిరిగిపోయే ప్రశ్నలు వేశారు.

అయితే అమెరికా పేరు, ట్రంప్ పేరు తీయకుండా జై శంకర్ సంధించిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జై శంకర్ రష్యాకి వెళ్ళాక ఆయనకు ప్రెస్మీట్లో కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ ప్రెస్మీట్లో విలేఖరులు ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలను అనుకూలంగా తీసుకున్న జై శంకర్ రెండో ప్రపంచ యుద్ధం జరిగాక ప్రపంచంలో రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అదే రష్యా - భారత్ అంటూ ఇండైరెక్టుగా అమెరికాకి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు. అయితే జై శంకర్ ఈ మాట మాట్లాడడానికి కారణం రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు రష్యాకి భారత్ నిధులు సమకూరుస్తుందనే దుష్ప్రచారం ట్రంప్ చేస్తున్నారు. అలాగే రష్యా నుండి భారత్ కి చమురు ధరలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఇండియా ఇలా రష్యాకు సపోర్ట్ చేస్తుందంటూ ట్రంప్ మాట్లాడారు.

అయితే ట్రంప్ మాటలను వ్యతిరేకిస్తూ జై శంకర్ ఎప్పటినుండో ఉన్న రష్యా భారత్ బంధాన్ని బయటపెట్టారు. ఇక రెండోది పదేపదే ఇండియాని టార్గెట్ చేస్తూ రష్యా నుండి ఎక్కువ చమురు ఇండియానే కొంటుంది అంటున్నారు. కానీ ఇండియా కంటే ఎక్కువ చమురు చైనా కొంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా అమెరికాకు ఆన్సర్ ఇచ్చారు. అలాగే రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యాక రష్యాతో ఇండియా అత్యధికంగా స్నేహం పెంచుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ యుద్ధం స్టార్ట్ అయ్యాక రష్యాకి అత్యంత దగ్గరైన దేశం భారత్ అయితే కాదని చెప్పుకొచ్చారు. అలాగే ఒకప్పుడు అమెరికానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక రష్యా నుండి చమురుని కొనమని ఎన్నో దేశాలకు సమాచారం ఇచ్చింది. అందులో మొదట ఇండియాకే ఇచ్చింది. అలాంటిది మీరే చమురు కొనమంటారు. మళ్లీ మీరే ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ జై శంకర్ సూటిగా ప్రశ్నించారు.

అంతేకాకుండా రష్యా నుండి చమురు కొనొద్దు అంటున్నారు. కానీ మేము రష్యాతో ఆయిల్ పాట్నర్ షిప్ కొనసాగిస్తాము. మీరు మా శత్రు దేశమైన పాకిస్తాన్ తో ఎనర్జీ రిలేషన్ ని కొనసాగించినప్పుడు మేము మీ ప్రత్యర్థి రష్యాతో ఎనర్జీ రిలేషన్షిప్ ని కొనసాగిస్తాము అన్నట్లుగా ధీటుగా బదులిచ్చారు భారత విదేశాంగ మంత్రి జై శంకర్. అయితే జై శంకర్ అడిగిన ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకి కూడా అమెరికా దగ్గర సమాధానం లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News