పాక్ పని పట్టాల్సిందే...జైశంకర్ హాట్ కామెంట్స్
భారత్ కి పొరుగున ఉన్న దాయాది దేశం పాక్ పని పట్టాల్సిందే అని భారత్ కృత నిశ్చయంతో ఉంది.
భారత్ కి పొరుగున ఉన్న దాయాది దేశం పాక్ పని పట్టాల్సిందే అని భారత్ కృత నిశ్చయంతో ఉంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. భారత్ ఎటూ ఈ విషయంలో పట్టుదలతో ఉంది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలకు కూడా భారత్ తరఫున జైశంకర్ కీలక సూచనలు చేశారు. ఉగ్రవాదంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టు కట్టవద్దు అని ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కనికరం చూపించకుండా మట్టు బెట్టాల్సిందే అని జైశంకర్ పిలుపు ఇచ్చారు. ఈ విషయంలో తన పర అన్న భేదాలను చూసుకోవాల్సిన అవసరం అసలు లేదని ఉండరాదని ఆయన బ్రిక్స్ దేశాలను కోరారు.
జీరో టాలరెన్స్ తోనే :
ఇదిలా ఉంటే ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతునన్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ ప్రసంగం సంచలనంగా మారింది. ఆయన ఉగ్రవాదం మీద అన్ని దేశాలు జీరో టాలరెన్స్ పాటించాలని పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రపంచం అంతా సిద్ధపడాలని కోరారు. ఈ విషయంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో కూడా సమూల మార్పులు సంస్కరణలు కూడా అవసరం అని జైశంకర్ కోరడం విశేషం. అంతర్జాతీయంగా శాంతికి పెను సవాల్ గా ఉగ్రవాదం ఉందని జైశంకర్ చెప్పారు. ప్రపంచానికి అది ఈ రోజున ప్రధాన సమస్యగా ఆయన అభివర్ణించారు. భారత్ అయితే ఉగ్రవాదం ఏ రూపంలో వదిలే ప్రసక్తి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రాజీ లేని పోరుగా :
ఉగ్రవాదం విషయంలో ప్రపంచం అంతా ఒకే విధానం అనుసరించాలని భారత్ కోరుతోంది. ఈ విషయంలో రాజీ పడేది లేదన్న కఠిన నియమం పెట్టుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ సంబంధాలను సైతం ఉగ్రవాదం దెబ్బ తీస్తోందని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజున ప్రపంచం ముందు అనేక సవాళ్ళు ఉనాయని అలాగే అనేక కీలక వ్యవస్థలు సైతం బలహీనంగా మారుతున్నాయని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అధిగమించాలంటే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక విభాగాలలో సంస్కరణలను తీసుకుని రావడం తక్షణ కర్తవ్యం అని ఆయన చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది ప్రపంచానికే పెను ముప్పు అవుతుందని దానికి అంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని జై శంకర్ పేర్కొన్నారు.
పాక్ పీచమణిచాం :
ఇక 2024 ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పాక్ ప్రోత్సాహంతో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 22 మంది దాకా అమాయకులు మరణించారని జైశంకర్ బ్రిక్స్ వేదిక మీద గుర్తు చేశారు. దానికి ప్రతీకారంగా భారత్ పాక్ మీద మే 7 నుంచి 10 దాకా నాలుగు రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ పీచమణచామని ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం నాశనం చేసింది అని ఆయన చెప్పారు. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను భారత్ ఈ ఆపరేషన్ లో హతమార్చిందని జైశంకర్ చెప్పరు.
చైనా సాయం మీద కూడా :
అయితే అదే సమయంలో పాక్ కి చైనా సాంకేతిక సాయం అందించినట్లుగా వచ్చిన వార్తల పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగానే స్పందించింది. ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాక్ లాంటి వాటి విషయంలో బాధ్యతాయుతమైన దేశాలు తీరు ఇక్కడ ఆలోచించుకోవాలని భారత దేశం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కోరారు. ఉగ్రవాదానికి సాయం చేసినట్లుగానే దీనిని భావించాలన్నది భారత్ అంటోంది.
మోడీతో భేటీ :
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.