బిగ్ బ్రేకింగ్... పులివెందులలో నామినేషన్‌ వేసిన సీఎం జగన్‌!

ఏపీలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-25 09:14 GMT

ఏపీలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ తమ నామినేషన్స్ ని దాఖలు చేశారు. ఈ సమయంలో తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈరోజు ఉదయం కడపకు చేరుకున్న ఆయన.. పులివెందులలో నామినేషన్ వేశారు.

అవును... వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం.. అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా తరలిరాగా... మినీ సెక్రటేరియట్‌ లోని ఆర్వో ఆఫీస్‌ కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ సమయంలో వైఎస్ జగన్ తో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యింది కాబట్టి... ఇక మేనిఫెస్టో విడుదల ఒకటి పెండింగ్ ఉందని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 26న వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు!

ఇక నామినేషన్ కు వెళ్లే ముందు పులివెందుల లోని స్థానిక సీఎస్‌ఐ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా... పులివెందుల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదే సమయంలో... వైఎస్సార్‌ కుటుంబం, వైఎస్సార్ వారసులం అని చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన సునీతలపై సీఎం జగన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Tags:    

Similar News