విపక్షల మీద జగన్ బ్రహ్మాస్త్రం... అదిరిపోయేలా మ్యానిఫేస్టోతో ...!

ఎన్నికల హామీలు ఎపుడూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఇచ్చే వారి వ్యక్తిత్వం స్థాయి. విశ్వసనీయత కూడా చూస్తారు జనాలు.

Update: 2024-02-10 03:45 GMT

ఎన్నికల హామీలు ఎపుడూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఇచ్చే వారి వ్యక్తిత్వం స్థాయి. విశ్వసనీయత కూడా చూస్తారు జనాలు. ఎన్నికలు అంటే ప్రతీ వారూ హామీలు ఇస్తారు. కానీ నెరవేర్చాల్సిన వారికే జనాలు పట్టం కడతారు. అలా జగన్ అయిదేళ్ల పాటు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చారు. నవరత్నాలను ఆయన ప్రకటించి వాటిని అమలు చేశామని చెబుతున్నారు.

ఈ నవరత్నాలు 2019లో వైసీపీని విజయ తీరాలకు చేరితే ఈసారి వాటికి మించిన హామీలతో జగన్ జనం ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. ఈసారి ఇచ్చే హామీలు ప్రధానంగా మూడు వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఉంటాయని అంటున్నారు.

ప్రధానంగా రైతుల విషయంలో రుణాల మాఫీ ప్రకటన జగన్ చేస్తారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే 65 నుంచి 70 లక్షల దాకా రైతులు ఉన్నారు. మొత్తం నాలుగు కోట్ల ఓటర్లలో 18 శాతం అన్న మాట. ఇది బిగ్ నంబర్ గానే చెప్పాలి. రైతుల రుణాలను తాను పూర్తిగా మాఫీ చేస్తాను అని జగన్ ఇచ్చే ఈ హామీ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అని అంచనా కడుతోంది వైసీపీ.

ఇదిలా ఉంటే మహిళలకు కూడా హామీలు ఉన్నాయని అంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమాన్ని మరింతగా చేస్తామని చెబుతూ కొన్ని పధకాలు ప్రకటిస్తారు అని అంటున్నారు. లక్షలలో ఉన్న డ్వాక్రా మహిళలకు కూడా కీలక హామీలు ఇస్తారని అంటున్నారు.

Read more!

అలాగే సామాజిక పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకు విడతల వారీగా పెంచుతామని జగన్ చెప్పబోతున్నారు. 2019 వేళ మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి దాని 2024 జనవరి నుంచి అమలు చేశారు. 2029 నాటికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కూడా చెప్పబోతున్నారు.

ఏపీలో సామాజిక పెన్షన్ తీసుకునే వారి సంఖ్య డెబ్బై లక్షలుగా ఉంది. దాంతో ఇది కూడా మరో కీలక అస్త్రంగా ఉంటుందని వైసీపీ నమ్ముతోంది. అలాగే యువత కోసం ప్రత్యేక హామీలు ఉంటాయని అంటున్నారు. ఇక పట్టణ వాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే విద్యావంతుల కోసం కూడా జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇవ్వబోతున్నారు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే వివిధ వర్గాలను ఎంచుకుని వారికి అవసరమైన వాటిలో హామీలను ఇవ్వడం ద్వారా నవరత్నాలను మించి జనాల మెప్పు పొందాలని జగన్ చూస్తున్నారు. అది కూడా సిద్ధం ముగింపు సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న జరిగే ఆ సభలో జగన్ ఈ హామీలను ప్రకటిస్తారు అని అంటున్నారు. మరి జగన్ ఏఏ హామీలు ప్రకటిస్తారు అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News