పెంచే విషయంలో తగ్గేదేలే అంటున్న జగన్!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పెండింగ్ లో లేకుండా జాగ్రత్తపడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

Update: 2023-12-21 11:27 GMT

ఎన్నికల ప్రచార సమయంలో జనాలకు ఇచ్చిన హామీలను మాగ్జిమం అమలుపరిచిన ప్రభుత్వం తమది అని వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ నిత్యం చెప్పుకుంటూనే ఉంటారు. దీనికి సంబంధించిన ప్రూఫ్ లను ప్రజల ముందు ఉంచుతుంటారు. ఈ సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని జగన్ తాజాగా నెరవేర్చారు. అయితే అది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుంది. కాగా.. ఇప్పటికే వాలంటీర్లకు జీతాలు పెంచిన సంగతి తెలిసిందే.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పెండింగ్ లో లేకుండా జాగ్రత్తపడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ క్రమంలో ఇప్పటికే 90శాతానికి పైగా నవరత్నాలు అమలు చేశామని చెబుతున్నారు. ఇదే సమయంలో తన బర్త్ డే సందర్భంగా అన్నట్లుగా తన మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా 750 రూపాయల గౌరవ వేతనాన్ని పెంచారు.

ఇదే సమయంలో తాజాగా పెన్షన్‌ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇందులో భాగంగా... రాష్ట్రంలో పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000 లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్‌ అమలులోకి రానుంది! ఇది అవ్వాతాతలకు జగన్ అన్న బర్త్ డే కం న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు.

ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ!:

మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా... రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్ లను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్‌ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆయన... పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని అన్నారు. విద్యార్థులకు మంచి చేస్తుంటే.. చెడు చేస్తున్నామంటూ విష ప్రచారం చేస్తున్నారని.. పేద విద్యార్థులపై విషం కక్కుతూ దిగజారుడు రాతలు రాస్తున్నారని ఫైరయ్యారు. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌ లు ఉంటే చెడిపోతారని.. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవకూడన్నట్లుగా కొందరు ఏడుస్తున్నారని ధవజమెత్తారు.

Tags:    

Similar News