విశాఖ జగన్ కి ఎంత దూరమో?

విశాఖలో ఏకైక అధికార కేంద్రం కూడా వైసీపీకి దక్కకుండా చిక్కకుండా పోయినట్లు అయింది.;

Update: 2025-04-20 02:30 GMT

విశాఖ అంటే జగన్ కి మోజు. కానీ ఆ విశాఖ మాత్రం ఆయనకు ఎప్పుడూ అందని పండు అవుతోంది. తాజాగా విశాఖ కార్పోరేషన్ మీద వైసీపీ జెండాని కూటమి నేతలు దించేశారు. దీంతో విశాఖతో ఉన్న ఆ బంధం కూడా వైసీపీకి కట్ అయింది.

విశాఖలో ఏకైక అధికార కేంద్రం కూడా వైసీపీకి దక్కకుండా చిక్కకుండా పోయినట్లు అయింది. విశాఖలో ఏకైక అధికార కేంద్రం కూడా వైసీపీకి దక్కకుండా చిక్కకుండా పోయినట్లు అయింది. విశాఖ జగన్ కి ఎంత దూరమో ?ఇక చూస్తే కనుక జగన్ 2019లో సీఎం అయ్యాక విశాఖ మీద ప్రేమ బాగా పెంచుకున్నారు. ఆయన ఏకంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన తరువాత జరిగిన జీవీఎంసీ ఎన్నికలు వైసీపీకి బాగా కలిసి వచ్చాయి.

విశాఖ దశ తిరుగుతుందని భావించే జనాలు అప్పటికి బలంగా ఉన్న టీడీపీని కాదని మరీ పట్టం కట్టారు. అయితే వైసీపీ మూడు రాజధానుల మీద ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేసింది దాంతో విశాఖ వాసుల ఆశలకు గండిపడింది. ఆ మీదట అమరావతి రాజధాని బెటర్ అన్న నిర్ణయానికి ఆంతా వచ్చేశారు.

దాని ఫలితమే 2024 ఎన్నికల్లో ఏకంగా ఎంపీతో పాటు మొత్తం విశాఖ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను కూటమి పార్టీ గెలుచుకుంది. ఇంకో వైపు చూస్తే వైసీపీ అధినేత అప్పటి సీఎం జగన్ ఎంతో ముచ్చట పడి విశాఖ బీచ్ రోడు వద్ద కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్ అక్కడ కనీసం కాలు మోపకుండానే మాజీ సీఎం అయిపోయారు.

తాను రెండోసారి సీఎం అయితే తన ప్రమాణం విశాఖలోనే అని ఎన్నికల ముందు విశాఖ సభలో ఆయన ప్రకటించారు. కానీ జనాలు మాత్రం కూటమిని గెలిపించారు. అలా జగన్ ఆశలను కాకుండా చేశారు. విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని రుషికొండ ప్యాలెస్ ని క్యాంప్ ఆఫీసుగా చేసుకుని పాలించాలన్నది జగన్ కలగా చెబుతారు.

ఇక లోకల్ గా పాలనకు జీవీఎంసీ కూడా వైసీపీ చేతిలో ఉండాలని అనుకున్నారు. అయితే ఈ కలలు అన్నీ కరిగిపోగా ఈ రోజు విశాఖ కార్పొరేషన్ కూడా వైసీపీ చేజారడంతో జగన్ డ్రీం సిటీ ఆయనకు ఎంత దూరమో మరింతగా అర్థం అయ్యేలా చేసింది అని అంటున్నారు.

విశాఖ మినీ ఇండియాగా అంతా చెబుతారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఉంటారు. వారు అభివృద్ధిని ప్రశాంతతను కోరుకుంటారు. ఆ విధమైన భరోసా వైసీపీ ఏ మేరకు ఇచ్చిందో తెలియదు కానీ వారు 2024 ఎన్నికల్లో ఓడించారు. టీడీపీ అభివృద్ధి మంత్రానికి ఓటు చేశారు. మరో ఏడాది పాలన మిగిలి ఉన్న జీవీఎంసీని ఇపుడు కూటమి గెలుచుకుంది. ఈ ఏడాదిలో తాము ఏమి చేస్తామో చూపిస్తామని అంటోంది.

అలా విశాఖ జనం మనసు గెలుచుకుని 2026లో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో మళ్ళీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమాగా చెబుతోంది. వైసీపీ నుంచి చేజారిన విశాఖ మేయర్ పదవిని దక్కించుకోవాలంటే చాలానే చేయాలి. ఆ విషయంలో అధినాయకత్వంతో పాటు అంతా కూడా తగిన యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాలి. లేకపోతే విశాఖ వైసీపీకి అందకుండానే అలా దూరం పెంచేస్తుందేమో అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా విశాఖలో ఎగిరిన వైసీపీ జెండా దించేయడం అంటే జగన్ కి కొంత బాధాకరమైన విషయం గానే చూస్తున్నారు.

Tags:    

Similar News