కార్యకర్తలతో జగనన్న...ముహూర్తం ఫిక్స్ !
ఎట్టకేలకు ఏడాదికి పైగా ఒక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనం బాట పడుతున్నారు.;
ఎట్టకేలకు ఏడాదికి పైగా ఒక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనం బాట పడుతున్నారు. ఆయన అంతా అనుకున్నట్లుగానే ఇది జరుగుతోంది అని అంటున్నారు. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి ఏడాది పాటు సమయం ఇవ్వాలని జగన్ భావించారు అని అంటున్నారు.
ఆ ఏడాది కాలం జూన్ 12తో ముగుస్తోంది. దాంతో జగన్ ఇక రెడీ అంటున్నారు. అయితే దానికి ఒక ముహూర్తం ఎంచుకున్నారు. జూలై 8న దివంగత నేత వైఎస్సార్ జయంతి. ఆ రోజు నుంచే జనంలోకి జగన్ వెళ్తారు అని అంటున్నారు. జిల్లాల వారీగా టూర్లకు ఆయన ప్లాన్ చేశారు అని చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో జగనన్న అని పేరు కూడా ఖరారు చేశారని తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో జగన్ టూర్ ఉంటుందని అంటున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో రెండేసి రోజుల పాటు జగన్ గడుపుతారు అని అంటున్నారు. ఒక్కో రోజు మూడేసి అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలతో ఆయన నేరుగా భేటీ అయి వారి నుంచి గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి మీద చర్చిస్తారు.
అలాగే పార్టీ కోసం పనిచేసే వారిని స్వయంగా గుర్తిస్తారు అని అంటున్నారు. అలాగే క్యాడర్ కి తాను అందుబాటులో ఉన్నాను అన్న సందేశం ఇస్తారని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత తన పర్యటనలు కూటమికి బలంగా ఉన్నాయని చెబుతున్న ప్రాంతాలలో చేస్తారు అని అంటున్నారు. గోదావరి జిల్లాల నుంచే తన టూర్లు మొదలెడతారు అని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఫైవల్యాల మీద హామీలు నెరవేర్చని తీరు మీద జగన్ తన పర్యటనలో ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ఎక్కడా సభలూ సమావేశాలు లేకుండా పార్టీ క్యాడర్ తో భేటీలు ఉంటాయని అలాగే ప్రజలతో ముఖా ముఖీ ఉంటుందని అంటున్నారు. ఇక మీడియా సమావేశాలు ఉంటాయని అంటున్నారు.
ఈ విధంగా వారానికి రెండు రోజులు పాటు జిల్లాలో పర్యటించేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. క్యాడర్ తో జగనన్న కార్యక్రమం మీద పూర్తి షెడ్యూల్ అంతా వచ్చే వారం రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. పల్నాడు జిల్లాలో జగన్ టూర్ తరువాత పూర్తి క్లారిటీ వాస్తుంది అని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి జనంలోకి వస్తమాని జిల్లా టూర్లు అని చెప్పిన వైసీపీ అధినాయకత్వానికి ఇది కరెక్ట్ సమయం అనిపించింది అని అంటున్నారు. మరి జగన్ జిల్లా టూర్లు జగన్ 2.ఓని బయటకు తెస్తాయా అన్న చర్చ ఉంది. అగ్రెసివ్ మోడ్ లో జగన్ ఈ టూర్లలో దూకుడు చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఈ ప్రొగ్రాం ఏ విధంగా రూపకల్పన చేశారో.