జగన్.. ఓదార్పు యాత్ర -3.0 .. !
ఈ క్రమంలోనే విశాఖ పట్నం సహా.. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు.
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆయన ప్రకటన కూడా చేశారు. ఏడాదిన్నర పాటు ఆయన పాదయాత్ర చేయనున్నారు. అయితే.. దీనికి ముందు.. ఓదా ర్పు యాత్ర - 3.0ను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రంలో పలు సంఘటనల కారణంగా.. కుటుం బ సభ్యులను కోల్పోయిన వారిని ఓదార్చేందుకు.. జగన్ రెడీ అవుతున్నారు. ఈ యాత్రతో మరోసారి ప్రజల్లోకి వెళ్లి పుంజుకోవాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.
దీనికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభించనున్న పాదయాత్రకు ముందు ట్రయల్‌గా ఈ ఓదార్పు యాత్రను చేపట్టనున్నారని అంటున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ ప్రభావం ఎంత ఉందన్నది ఆయన భేరీజు వేసుకుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ పట్నం సహా.. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు.
ఓదార్పు యాత్రలు జగన్ కు కొత్తకాదు. గతంలో వైఎస్ మరణం తర్వాత.. ఆయన యాత్రలు చేశారు. అయితే.. అప్పటి యాత్రకు.. ఇప్పుడు చేపడుతున్న యాత్రకు తేడా ఉంది. అప్పట్లో రాజకీయాలకు కొత్త కాబట్టి.. వైఎస్ వారసుడిగా ఆయనకు సింపతీ వచ్చింది. కానీ, ఇప్పుడు ఐదేళ్ల పాలన.. తర్వాత, కూటమి ప్రభుత్వ దూకుడు తర్వాత చేపడుతున్న యాత్రలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది సందేహం. పైకి సక్సెస్ కావడం వేరు ఓటు బ్యాంకుగా మారడం వేరని అంటున్నారు.
ఓటు బ్యాంకు పరంగా గత ఎన్నికల్లో 40 శాతం సాధించామని చెబుతున్నా.. ఇప్పుడు అది ఏమేరకు ఉం దన్నది ప్రశ్న. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. పంచాయతీల్లో అభివృద్ధి పెరిగింది. నగరాల్లో రహ దారుల అభివృధ్ధి కనిపిస్తోంది. ఇక, ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య కనెక్టివిటీ కూడా ఏదో ఒక రూపంలో పెరుగుతూనే ఉంది. అదేసమయంలో రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వాటిని పరుగులు పెట్టిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇన్ని ప్లస్సులు కూటమికి ఉండగా.. జగన్ ఓదార్పు యాత్రలతో ఒరిగేది ఏంటన్నది ప్రశ్న.