ఓడినా.. పట్టు జారలేదు: జగన్ వే కరెక్టేనా ..!
ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే.. వెంటనే తిరుగుబాట్లు వస్తాయి. పార్టీపై ఎదురు తిరుగుతారు. పార్టీ అధినేత పై విరుచుకుపడతారు.;
ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే.. వెంటనే తిరుగుబాట్లు వస్తాయి. పార్టీపై ఎదురు తిరుగుతారు. పార్టీ అధినేత పై విరుచుకుపడతారు. కానీ.. గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైనప్పటికీ.. జగన్‌పై భారీ స్థాయిలో ఎవరూ విమర్శలు చేయలేదు. ఆయనను మెచ్చుకోకపోవచ్చు.. కానీ.. పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు.. జగన్‌పై నిప్పులు చెరగలేదు. ఇక, ఇప్పటికీ.. పార్టీలో ఆయనదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఓడిపోయిన తర్వాతైనా.. ఆయన పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారా? అంటే లేదు.
అయినప్పటికీ.. పార్టీ నాయకులకు జగన్ అంటే బెరుకే. ఇప్పుడు ఇవి రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చా యి. రాష్ట్రంలోని ఓ పార్టీలో జరుగుతున్న పరిణామాలను పోల్చుతున్న విశ్లేషకులు.. పార్టీపై పట్టు విష యంలో జగన్ అనుసరిస్తున్న విధానాలే కారణమని చెబుతున్నారు. ఎవరినీ లెక్కచేయకపోవడం.. ఆయన నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్న విమర్శలు ఉన్నా.. జగన్‌ను కాదనుకుని బయటకు వచ్చేందుకు చాలా మంది నాయకులు వెనుకాడుతున్నారు.
కారణాలు ఏవైనా.. పార్టీపై పట్టు మాత్రం జగన్ కోల్పోలేదు. వాస్తవానికి.. 11 స్థానాలు మాత్రమే దక్కిన నేప థ్యంలో కీలక నేతలు.. కొందరు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తారని అనుకున్నారు. కానీ, అలా జరగ లేదు. వెళ్లిన వారు వెళ్లిపోయినా.. మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. నిజానికి ఇప్పటికీ.. చాలా మంది జగన్ అప్పాయింట్‌మెంటు కోసం ఎదురు చూస్తున్నారు. అయినా.. ఆయన వారిని పెద్దగా పట్టించుకోవ డం లేదు. అంతేకాదు.. నిరసనలు, ధర్నాలకు కూడా ఆయన ఇప్పటి వరకు హాజరు కాలేదు.
వ్యూహం ఏదైనా.. పార్టీపై పట్టు మాత్రం నిలబెట్టుకుంటున్నారు. దీనికి కారణం.. తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే పార్టీ నడుస్తోందన్న కారణం కావొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఒకరికి అవకాశం ఇస్తే.. మరింత మంది ఇలానే లైన్‌లో నిలబడతారన్న వ్యూహం కావొచ్చు.. ఏదేమైనా.. జగన్ మాత్రం పార్టీ విషయంలో ఆది నుంచి ఎలాంటి వైఖరిని అవలంభిస్తున్నారో.. అదే ధోరణిని పాటిస్తున్నారు. పోయిన వారిని బ్రతిమాలరు.. ఉన్న వారిని బుజ్జగించరు. ఇది ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. వైసీపీలో మాత్రం ఆది నుంచి జరుగుతున్నదే!. మరి ఇది కరెక్టేనా? కాదా? అంటే.. సమాధానం లేదు.